Saturday, July 17, 2021

తెలియని స్థితి అనాలో... మూర్ఖత్వం అనాలో

ఏమిటీ ఈ దుస్థితి

Image from QuotesLyfe

 ప్రతీ సంవత్సరము కొన్ని వేల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు... కానీ ఏ ఒక్కరు ముందుకు వచ్చి జీన్ మాడిఫైడ్ (స్టెరోయిడ్స్ వాడిన), పాలు, చికెన్, గుడ్లు, చేపలు తినవద్దు అనీ, కల్తీ నూనెలు వాడవద్దు అనీ, పాలిథిన్ వాడవద్దు అనీ, కూరగాయలకు, పంటలకు పెస్టిసీడ్స్ వాడవద్దు అనీ ఎవరు చెప్పరు.

మనం తింటున్న ఆహారం వల్ల, ఎన్నో రకాల జబ్బులు వచ్చి కొన్ని లక్షల మంది చనిపోతున్నారు... కానీ ఏ ఒక్క మేధావి వచ్చి ఇలాంటి ఆహారం తినవద్దు, మంచి ఆహారం తినమని ఏ ఒక్కడు చెప్పడు.

స్టెరోయిడ్స్ వాడిన పాలు, చికెన్, గుడ్లు, చేపల వల్ల ఎన్నో రోగాలు వచ్చి చాలా మంది చనిపోతున్నా. రోజూ ఒక గుడ్డు, వారంలో చాలా సార్లు చికెన్ తిను అని చెప్తారే తప్ప... అవి తినవద్దు, రోజు పండ్లు తినాలి అని ఏ ఒక్క డాక్టర్ ముందుకు వచ్చి చెప్పరు.

ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, కూల్ డ్రింక్స్ వల్ల కొన్ని వేల కుటుంబాలు నాశనం అవుతున్నాయి, చనిపోతున్నారు. అయినా ఏ ఒక్కడు వచ్చి ఇది మానేయ్యాలి అని చెప్పడు.

కానీ అవసరం లేకున్నా, ఈ మందులు వాడు, ఆ మందులు వాడు, ఆ వ్యాక్సిన్ వాడు ఈ వ్యాక్సిన్ వాడు అని మాత్రం చెప్తారు. ఇలా ప్రతీ దానికి మందులు, వ్యాక్సిన్ లే అనీ నమ్మించి... బడా బాబులు జేబులు నింపుకుంటున్నారు.

ఏ ఒక్కడు నేచర్ ని నమ్ముకొండి, ప్రకృతిలో అన్నీ ఉన్నాయి అని మాత్రం ఎవడు ముందుకు వచ్చి చెప్పడు. 

ప్రజలను భయ బ్రాంతులకు గురిచేసి, అపోహలు సృష్టించి పక్క ద్రోవ పట్టిస్తూ ఎన్నో ప్రాణాలను బలి తీసుకుంటున్నారు.

కానీ ఆలోచిస్తే ప్రజలు కూడా అలానే ఉన్నారు. ఏవి నమ్మాలో, ఏవి నమ్మకూడదో తెలియని స్థితిలో...  😔

తెలియని స్థితి అనాలో... మూర్ఖత్వం అనాలో... 🤦‍♂



What a plight


Thousands of people are diagnosed with cancer each year... But no one will come forward and say gene modified (used steroids), do not drink milk, eat chicken, eggs, fish, do not use adulterated oils, do not use polythene, do not use pesticides for vegetables and crops.

Because of the food we eat, many kinds of diseases come and millions of people die... But do not let any single genius come and eat such food, no one will tell you to eat good food.

Milk, chicken, eggs and fish used in steroids cause many diseases and many people die. One egg per day, unless told to eat chicken several times a week. No doctor will come forward and tell you not to eat them and to eat fruits during the day.

Alcohol, cigarettes, gutka, and cool drinks are destroying thousands of families. Yet no one will come and tell you to give it up.

But even if it is not necessary, It is said that use that medicine, use this medicine, use that vaccine, use this vaccine... Believing that there is a drug and a vaccine for each of these, the big boys are filling their pockets.

No one believes in Nature, no one can come forward and say that everything is in nature.

People are being terrorized, myths are being created and many lives are being sacrificed.

But people think so too. In a state of not knowing what to believe and what not to believe.

In the state of the unknown, or in the state of stupidity...

Saturday, May 15, 2021

భయమే మరణం

భయమే మరణం


Image from Training Journal

కరోనా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మరి అది నిజంగానే వ్యాపిస్తూ ఉందా లేక వాళ్లకు కరోనా వచ్చింది, వీళ్లకు కరోనా వచ్చింది అని భయమే ఎక్కువ అయ్యి మనమే భయంతో ఏ సమస్య వచ్చినా కరోనానే అని బయపడి ప్రాణం మీదికి తెచుకుంటున్నమా. ఒకవేళ కరోనా వచ్చినా చాలామంది కోలుకుని మళ్ళీ మామూలు స్థితికి వస్తున్నారు, ఎక్కడో ఒకచోట ప్రాణం కోల్పోతున్నారు, ఆ ఒక్కరిని చూసి మనం మన ప్రాణాలను కూడా కోల్పోతున్నాము.

నిజంగా ఆ కరోనా మనిషిని చంపే అంత పెద్దదా... కాదు, నాకు తెలిసి ఈ భూప్రపంచంలో మనిషిని మించిన పెద్ద వైరస్ ఇంకో జీవి లేదు, ఎందుకంటే వాటి కంటే మనకు ఆలోచన మరియు మాట్లాడే గొప్ప వరాలు ఉన్నాయి. మరి అన్నిటిని సాధించిన మనిషి ఈ చిన్న వైరస్ కు భయపడితే ఎలా. ఇప్పటివరకు ఎన్నో వైరస్ లు వచ్చాయి, వాటన్నిటినీ జయిస్తూ వచ్చాము. ఇదీ అంతే, పోరాడుదాం, ధైర్యంతో ఎదురుకొందాం. ఈ న్యూస్ లు, పేపర్ లో చూసి ఇంత మంది పోయారు, అంత మంది పోయారు అని ఆలోచించకుండా, మనం వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించండి, మీలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. ఇప్పుడు కరోనా.. రేపు ఇంకోటి రావొచ్చు..

Image from Real Life Counseling

మరి దాన్ని ఎలా ఎదుర్కొంటాం, ఇప్పటికైనా మారుదాం, మన జీవనశైలినిఆహారాన్ని మార్చుకుందాం. ఎలాంటి వైరస్ ని అయిన ఎదుర్కొందాం. దైర్యంగా ఉందాం, భయంతో చస్తూ బ్రతకవద్దు. భయమే మరణం, ఆ భయమే మన రోగ నిరోధక శక్తిని హరించివేస్తుంది. 

అనవసర అపోహలకు పోవద్దు, తొందరపడి ఏదో అవుతుంది అని కంగారుపడవద్దు. తొందరలో ఏ మందులు పడితే అవి వాడవద్దు. డాక్టర్ చెబితేనే వాడండి. చేతులు కాలి నాక ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నించవద్దు. ముందు జాగ్రత్తగా ఉండి మంచి పౌష్టికాహారం తీసుకొని, సంతోషంగా ఉండండి. ఇంట్లో ఉండి వేరే విషయాల గురుంచి ఎక్కువగా ఆలోచించకండి. మీ గురించి, మీ కుటుంబం గురించి మంచి ఆలోచనలు చేయండి. మీలో రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. ఇప్పటి వరకు చేసిన తప్పులను గ్రహించుకోండి, వాటిని మార్చుకోవడానికి ప్రయత్నించండి. 

దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితాన్ని మంచిగా మలుచుకుందాం. అన్నిటికి ఉద్రిక్తత చెందకుండా నిమ్మలంగా ఆలోచనతో ముందుకుపోదాం.

ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు, అలా అని భయపడుతూ పోదామా. చివరి వరకు పోరాడుదాం, మనిషి బలవంతుడు అని నిరూపించుదాం.

Sunday, May 2, 2021

రక్షణ వ్యవస్థ బలంగా ఉండాలంటే | How to improve immunity system

రక్షణ వ్యవస్థ బలంగా ఉండాలంటే

Image from News Medical Life Sciences

కరోనా వైరస్ కావొచ్చు లేదా ఎలాంటి వైరస్ లు మన మీద ప్రభావం చూపకుండా రక్షించబడాలంటే మన బాడీ లో రక్షణ వ్యవస్థ బలంగా ఉండాలి. ఆ రక్షణ వ్యవస్థ బలంగా ఉండాలంటే ముందుగా మూడు విషయాలు గుర్తించుకోవాలి.
ఒకటి ఎలాంటి పరిస్థితిలోనైనా ధైర్యాన్ని కోల్పోకూడదు. రెండవది మన జీవన విధానం మంచిగా మార్చుకోవడం, మూఢవది మనం తినే ఆహారం మరియు తినే విధానం. ఇవి మారితేనే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

రోగ నిరోధక శక్తి పెరగడానికి మనం రోజూ పాటించవలసిన నియమాలు...
1. నిద్ర లేవగానే పడగడపున ఒకటి లేదా ఒకటిన్నర లీటర్ల నీటిని త్రాగండి. కాలకృత్యాలు తీర్చుకోండి.
2. రోజు ఒక గంట వ్యాయామం, బ్రీతింగ్ వ్యాయామాలు, ఆసనాలు, ధ్యానం (మెడిటేషన్) చేయండి.
4. ఉదయం ఒక వెజిటబుల్ జ్యూస్ (క్యారెట్ బీట్ రూట్ కీరా, బీర, సొర, పొట్ల, నిమ్మ, పుదీనా కొత్తిమీర మొదలగున్నవి) త్రాగండి.
5. ఉదయం అల్పాహారంలో పండ్లు (ముఖ్యంగా సి విటమిన్ ఉన్న పండ్లు తినండి... ఉదాహరణకు జామ పండ్లు), డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ లేదా మొలకెత్తిన విత్తనాలు మాత్రమే తీసుకోండి.
6. మధ్యాహ్నం భోజనం 12 నుండి 1 గంట లోపే తినేయండి.
7. భోజనం తినేటప్పుడు ఒక నియమం పాటించండి. భోజనానికి అరగంట ముందు రెండు గ్లాసుల నీళ్లు త్రాగండి, భోజనం తినేటప్పుడు నీళ్లు త్రాగకండి, తిన్న తర్వాత ఒక బుక్క నీళ్లు మాత్రమే త్రాగండి. ఆ తర్వాత రెండు గంటల తర్వాత మాత్రమే నీళ్లు సరిపడా త్రాగండి. ఆ తర్వాత గంట గంటకు ఒకటి లేదా రెండు గ్లాసుల చొప్పున నీళ్లు త్రాగుతూ ఉండండి.
8. భోజనం చేసేటప్పుడు 50% కూరగాయలు (కర్రీస్) ఉండేటట్టు చూసుకోండి. కర్రీస్ లలో ఉప్పు నూనెలు తక్కువగా ఉంటే ఎక్కువ మొత్తంలో కూరగాయలు తినగలుగుతాం.
9. సాయంత్రం నాలుగు గంటలకు ఏదైనా ఒక గ్లాస్ పండ్ల రసం త్రాగండి. కుదరకపోతే ఒక గ్లాస్ మజ్జిగ నన్నా త్రాగండి.
10. సాయంత్రం ఐదు ఐదున్నర గంటలకు నాలుగు గ్లాసుల నీళ్లు త్రాగి మోషన్ కి వెళ్ళండి, ఇలా చేస్తే మన లోపల ప్రేగులు మంచిగా క్లీన్ అవుతాయి, ఆకలి బాగావేస్తుంది. అంటే రోజులో రెండు సార్లు అయినా మోషన్ కంపల్సరీ గా వెళ్ళండి.
11. రాత్రి భోజనం త్వరగా చేసేటట్టు చూసుకోండి, అంటే.. సాయంత్రం 6.30 లేదా 7 లోపే తినేయండి.
12. రోజు 60 నుంచి 70% నేచురల్ పదార్థాలు బాడీలోకి వెళ్ళేటట్టు చూసుకోండి. అంటే పండ్లు, పండ్ల రసాలు, కూరగాయల రసాలు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, మొలకెత్తిన విత్తనాల రూపంలో వెళ్లేటట్టు చూసుకోండి.
13. రోజు మొత్తంలో నాలుగు నుండి ఐదున్నర లీటర్ల నీటిని త్రాగటానికి ప్రయత్నించండి.
14. దైర్యంగా, ఉల్లాసంగా ఉండండి, మంచి ఆలోచనలతో ఉత్సహంగా ఉండటానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు.
16. జంక్ ఫుడ్, చెడు వ్యాసనాలు మానేయటానికి ప్రయత్నించండి.

పైన చెప్పిన విషయాలు మీరు పాటిస్తే ఎలాంటి వైరస్ లతో నైనా మీ బాడీ పోరాడటానికి రెడీగా ఉంటుంది.

🙏

కరోనా సెకండ్ వేవ్ విషయంలో జాగ్రత్త | Be careful on Corona Second Wave



 
అందరికి విజ్ఞప్తి,

కరోనా సెకండ్ వేవ్ విషయంలో జాగ్రత్త వహించండి. ముందుగా ఎవరు బయపడవద్దు. ధైర్యంగా ఉండండి, వైరస్ కన్నా బలవంతుడు మనిషి. మీరు దైర్యంగా ఉంటే వైరస్ మిమ్మల్ని ఏమి చేయదు. మీలో రోగ నిరోధక శక్తి ఉన్నంత వరకు ఏ వైరస్ మిమ్మల్ని ఏమి చేయదు. పాజిటివ్ వచ్చింది కదా అని తొందరపడి హాస్పిటల్ కి వెళ్లవద్దు. అన్నిటిని అవలోకనం చేసుకున్నాకే, తప్పని సరి అయితేనే హాస్పిటల్ కి వెళ్ళండి. లేకపోతే ఇంటి వద్దనే తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఊరికనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవద్దు. జలుబు, దగ్గు, జ్వరం వేరే వైరస్ వల్ల కూడా రావచ్చు.

కరోనా వచ్చిన వాళ్ళను దూరం పెట్టి అంటరాని వాల్లలాగా చూడవద్దు, వాళ్లకు సరైన పోషక విలువైన ఆహారాన్ని అందించండి. రోగ నిరోధక శక్తిని పెంచటానికి ప్రయత్నించండి.

అసలు తప్పు జరుగుతున్నది మీడియా చెప్పే న్యూస్ వల్లనే.

కరోనా విషయం లో తీసుకోవలసిన ముఖ్యమైన విషయాలు...

1. టీవీ, మీడియా, పేపర్ చూడటం ఆపేయండి కొన్ని రోజులు. కావాలంటే మంచి ప్రోగ్రామ్స్, సినిమాలు చూడండి.
2. మంచిగా ఇంట్లోనే ధ్యానం చేయండి.
3. బ్రీతింగ్ వ్యాయామాలు చేయండి
4. పౌష్టికాహారం తీసుకోండి. మనం ఇప్పుడు తింటున్న ఆహారం సరైనది కాదు. అవి ఏమి తినాలి, ఎలా తినాలో తెలుసుకోండి.
5. మన జీవన విధానాన్ని మార్చుకోండి.

మాస్క్, సానీటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటించకున్నా పర్లేదు కానీ (అంటే పాటించవద్దు అని కాదు, పైన చెప్పిన విషయాలు ఇంకా ముఖ్యమని దాని అర్ధం), పైన చెప్పిన విషయాలు పాటించండి. 

నవీన్ వల్లోజు
TechnoSpoorthi🙏

Monday, April 19, 2021

కరోనా 2 వేవ్ | Conora 2nd Wave

కరోనా 2 వేవ్

కరోనా 2 వేవ్... వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది. మరి ఏమి చేయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు నీటి వలన, ఇంకొందరు గాలి వలన వ్యాపిస్తోంది అని చెప్తున్నారు. మాస్క్, సానిటైజర్, సోషల్ డిస్టెన్స్ నియమాలు పాటిస్తే చాలా! ఇవి ఎంత వరకు కాపాడగలుగుతాయి. అసలు ఇవి నిజంగా సాధ్యమేనా.




Stay Home and Stay Safe... అని అందరూ అంటున్నారు. మరి ఇంట్లో ఉంటే ఆ వైరస్ అంటకుండా ఉంటదా. మరి ఇంట్లో ఉంటే మన పనులు ఎవరు చేయాలి, ఎలా చేసుకోవాలి. ఎన్ని రోజులు ఇలా చేయాలి... ఇప్పటికైనా ఆలోచించాల్సిన విషయం.

కరోనా ఎలా ఉంటది. దాని వల్ల వచ్చే లక్షణాలు ఇప్పటివరకు ఎవరైనా నిర్దేశించారా! ప్రపంచం మొత్తం భయపడుతూనే ఉంది, కానీ ఏమీ చేయలేకపోతుంది. కంటికి కనపడని వైరస్ తో పోరాడుతున్నాము. కనీసం కనపడుతుంటే అన్నా వాటితో పోరాడవచ్చు, లేదా మన ఇంటికి రాకుండా తలుపు, కిటికీ, మరియు గేట్ మూసేయా వచ్చు.

కొందరైతే ఏ లక్షణాలు కనపడ్డా వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకుంటున్నారు. కరోనా అని తెలియగానే హాస్పిటల్ లో అడ్మిట్ అయి నానా తిప్పలు పడుతున్నారు, ఇప్పుడు చూస్తే అసలు హాస్పిటల్ లో బెడ్స్ కూడా దొరకని పరిస్థితి ఉంది. హాస్పిటల్ కు వెళ్ళటానికి ఉండే ఉత్సహం మంచి ఆహారం, మంచి అలవాట్లు చేసుకోవటానికి జనాలకు తీరిక దొరకటం లేదు. ఎంత విచిత్రం. మరి ఆ హాస్పిటల్ లో ఇచ్చే ఆంటీ బయటిక్స్ కు ఎంత మంది తట్టుకోగలుతున్నారు. అలాంటి పెద్ద మొత్తంలో ఖర్చుకు కూడా జనాలు వెనకాడటం లేదు, కానీ ఎంతో సింపుల్ గా ఉండే మంచి జీవన విధానం అలవాటు చేసుకోలేకపోతున్నారు.

అప్పుడో ఇప్పుడో కొద్దిగా డాక్టర్ల నోటా, కొందరు నిపుణులు చెప్తున్న మాట రోగ నిరోధక శక్తి (ఇమ్మ్యూనిటి పవర్). మరి రోగ నిరోధక శక్తి పెరగటానికి ఎవరు సరిగా చెప్పరే. చెప్పే కొందరు నిపుణులను ఎవరు పట్టించుకోరే. టాబ్లెట్స్, వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుందా. అవి ఎప్పటి వరకు కాపాడగలుగుతాయి. ఇంకొందరు ప్రోటీన్ పేరుతో చికెన్, గుడ్డు... తినాలని డాక్టర్లతో సహా చెప్తున్నారు, అసలు జ్వరం వస్తేనే ఏమి తినవద్దు, త్వరగా జీర్ణం అయ్యేవి తినాలని చెప్తారు లేదా బ్రెడ్ పాలు త్రాగండి అని అంటారు, మరి నాన్ వెజ్ ఎలా అరుగుతుంది ఆ టైంలో. అసలే జీర్ణ వ్యవస్థ ఆ టైంలో పనిచేయడానికి కూడా సహకరించదు. మరి అవి తినమని ఎలా సలహా ఇస్తున్నారు. పాపం కొందరు తెలియక కరోనా రాగానే, లేదా వస్తుంది అని చికెన్, గుడ్లు తెగ తినేస్తున్నారు. మరి అదే ప్రోటీన్ కురాగాయలల్లో లేవా... ఒకసారి ఆలోచించండి మిత్రులారా. నిజాన్ని గ్రహించండి.

ఏంటి వీడు ఏదో సోది చెప్తున్నాడు అని అనుకోకండి. అందరూ చివరి వరకు మొత్తం చదవండి, విషయాన్ని గ్రహించండి, ఇప్పటికైనా మేల్కొనండి. మనల్ని కాపడేది ఒక మన రోగ నిరోధక శక్తి మాత్రమే. మరి ఒక్క రోజులో రోగ నిరోధక శక్తి పెరుగుతుందా అనే అనుమానం వస్తుంది. దాని గురుంచి మీరు అంతగా ఆలోచించవద్దు. మీరు క్రమం తప్పకుండా ఈ క్రింద చెప్పే విషయాలు పాటించండి, పాటించిన తర్వాత మీకే తెలుస్తుంది మనలో రోగ నిరోధక శక్తి ఎలా పెరుగుతుందో. ఇది ఏదో కొద్దీ రోజులు పాటించేవి కాదు, మనం నిత్యం అలవాటు చేసుకోవాల్సిన విషయాలు... ఇవి మారిపోయాయి కనుకే మనకు ఇలాంటి విచిత్రమైన రోగాలు వస్తున్నాయి. మరి రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఏమి చేయాలి.

ముందుగా మనం చేయవలసినది ఈ రెండు మాత్రమే ఒకటి మన జీవన విధానం మంచిగా మార్చుకోవడం, రెండవది మనం తినే ఆహారం మరియు తినే విధానం. ఇవి మారితేనే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

పాటించవలసిన నియమాలు...

1. నిద్ర లేవగానే పడగడపున ఒకటి లేదా ఒకటిన్నర లీటర్ల నీటిని త్రాగండి.
2. రోజు మొత్తంలో నాలుగు నుండి ఐదున్నర లీటర్ల నీటిని త్రాగటానికి ప్రయత్నించండి.
3. ఉదయం అల్పాహారంలో పండ్లు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ లేదా మొలకెత్తిన విత్తనాలు మాత్రమే తీసుకోండి.
4. కుదిరితే రోజుకు రెండు పూటలే తినేటట్టు చూసుకోండి.
5. రాత్రి భోజనం త్వరగా చేసేటట్టు చూసుకోండి, అంటే.. కుదిరితే సాయంత్రం 6.30 లేదా 7 లోపే తినేయండి.
6. రోజు 60 నుంచి 70% నేచురల్ పదార్థాలు బాడీలోకి వెళ్ళేటట్టు చూసుకోండి. అంటే పండ్లు, పండ్ల రసాలు, కూరగాయల రసాలు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, మొలకెత్తిన విత్తనాల రూపంలో వెళ్లేటట్టు చూసుకోండి.
7. రోజు వ్యాయామం, బ్రీతింగ్ వ్యాయామాలు, ఆసనాలు, ధ్యానం (మెడిటేషన్) చేయండి.
8. దైర్యంగా, ఉల్లాసంగా ఉండండి, మంచి ఆలోచనలతో ఉత్సహంగా ఉండటానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు.
9. జంక్ ఫుడ్, చెడు వ్యాసనాలు మానేయటానికి ప్రయత్నించండి.


ఇంకా ఏమైనా విషయాలు కావాలన్న, ఎలా పాటించాలి అన్నా నన్ను సంప్రదించవచ్చు (నవీన్ 9959941110), నేను మీకు సహాయం చేస్తాను.

ఒకవేళ కరోనా వచ్చినా ఈ క్రింద ఉన్న లింక్ లో పేర్కొన్న విషయాలు పాటించండి. ఒకవేళ డాక్టర్ల సలహా మేరకు మెడిసిన్ వాడుతూ కూడా ఈ ఆహార నియమాలు పాటించవచ్చు. తింటేనే ఆహారం అనుకోవద్దు. రసాల రూపంలో కూడా ఆహారమే అవుతుంది అని గ్రహించండి.

Tuesday, November 10, 2020

హైదరాబాద్ లో వరద బీభత్సం

హైదరాబాద్ లో వరద బీభత్సం:

ఓ వైపు కరోన చేసిన బీభత్సం, వెంటనే ఈ వరద బీభత్సం. కరోన వైరస్ నుంచి తెరుకుంటున్నం అనేలోపే ఈ అనుకోని వాన. అంతా అతలాకుతలం. ఉన్న కొన్ని చేరువులన్నీ నిండి పొంగి పొర్లడం, కొన్ని కట్టలు తెగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తడం. చాలా మంది వారి నివాసాలను కోల్పోవడం. ఈ కొద్ధి వర్షానికే ఏంటి ఈ పరిస్థితి. మరి ఈ తప్పెవరిది. ప్రకృతి వైపరిత్యమా లేక ఈ మాత్రం ఎదుర్కోలేని మన ప్రభుత్వాల లోపమా. ప్రభుత్వం అంటే పాలకులు మాత్రమేనా లేక ప్రజలు కూడానా.

ముమ్మాటికీ ఇది మన లోపమే. ఈ ప్రకృతి వైపరిత్యాలకు కారణాలు ఎవరు. అందులో మన పాత్ర ఎంత ఉంది, మన ప్రభుత్వాల బాధ్యత ఎంత ఉంది.

Techieride NGO team helping the people to take safe place

ప్రభుత్వ లోపాలు:

ప్రతి సంవత్సరమూ వర్షాలు వస్తూనే ఉన్నాయి. కానీ అవి మాములు వర్షాలుగా రావటం లేదు. వస్తే వరదలు లేదంటే వర్షాలే లేకుండా పోవడం. చెప్పటానికి ఏదో ఒక వైపరిత్యం అని చెప్పుకుంటున్నాము. మరి దానికి మనం చేసే తప్పులు ఏమి లేవా. ఒక సంవత్సరము ముప్పు వచ్చిందంటే కొన్ని రోజులు చర్చలు, మీడియాలో కొన్ని రోజుల వరకు ప్రచారం, దానికి ప్రభుత్వం ఇచ్చే కొద్ది పాటి సహాయం. ఆ తర్వాత మళ్ళీ షరామాములే. మళ్ళీ వచ్చే సంవత్సరానికి చర్యలు తీసుకోవడం మాత్రము ఉండదు. మరి ఇది ప్రభుత్వ లోపం కాదా. ఇప్పుడు జరిగినది మళ్ళీ జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిది కాదా!

సిటీలో ఉన్న కుంటలు, చెరువులూ కబ్జా జరగకుండా చూసుకునే భాధ్యత ఎవరిది. అది ప్రభుత్వానిది కాదా. ప్రతి సంవత్సరము చెరువులు, కుంటలు పూడికలు తీసి ఉంచితే వరద నీటిని కాపాడు కోలేమా. కుంటలు, చెరువులు నిండితే అవి అలుగుపారి వేరే చోటికి పంపే ప్రక్రియ ఎందుకు ఉండటం లేదు. అసలు కుంటలు, చెరువుల చుట్టు ప్రక్కల ఇల్లు కట్టడాలకు ప్రభుత్వం ఎలా అంగీకరిస్తుంది.

ప్రభుత్వ పాలకులం అని చెప్పుకునే ఏ రాజకీయ నాయకుడు ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు. ఐదు సంవత్సరములు పాలన కాగానే అది మా బాధ్యత కాదు... ముందు ఉన్న ప్రభుత్వాలు ఏమి చేశాయి అని అనటం తప్ప, వచ్చిన ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవటం లేదు.

రహదారి వేసే కాంట్రాక్టు దారుడు రోడ్డు వేసేటప్పుడు రహదారికి ఇరువైపుల కనీసం ఫుట్పాత్ (నడిచివెళ్ళే) దారి కూడా వేయడం లేదు. మరి వర్షం వస్తే రహదారి (రోడ్డు) మీద పడ్డ వర్షం వెళ్ళటానికి రోడ్డుకు ఇరువైపుల ఇంకుడు గుంతల నిర్మాణం ఎందుకు జరగడం లేదు. రోడ్డుకు ఇరువైపుల ఇరవై అడుగుల దూరంకో ఒక ఇంకుడు గుంత ఉంటే రోడ్డు మీద నీరు ఎందుకు నిలుస్తుంది. రోడ్డు ఎందుకు కరాబు అవుతుంది. రహదారి మీద పడ్డ ప్రతీ వర్షపు చుక్కను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిది కాదా. ఆ నీరు డ్రైనేజి లోకి ఎందుకు పోవాల్సి వస్తుంది. రోడ్డుకు ఇరువైపుల చెట్లు నాటకపోవడం కూడా దీనికి ఒక కారణమే. సిటీలో చాలా చోట్ల అసలు రోడ్డుకు ఇరువైపుల చెట్లే లేవు. అదే చెట్లు ఉంటే ఆ వాన నీటిని భూమిలోకి వెళ్ళటానికి సులువుగా ఉంటుంది. ఇది ప్రభుత్వ లోపం కాదా!

అప్పట్లో ఎప్పుడో వరదలు వస్తే నిజాం ప్రభుత్వం ఎక్కడో ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి మరీ మన డ్రైనేజీ సిస్టంను బాగుచేయించారని. ఇంకా మనం అప్పటి పద్దతినే వాడుతున్నాము. ఇంత జనాభా పెరిగినా ఇంకా పాత పద్దతినే పాటిస్తున్నాము. దానిని బాగుచేసుకోవాలని అని ఏ ఒక్కరు ఆలోచించటం లేదు. అప్పటి నుండి ఇప్పటివరకు అలాంటి సివిల్ ఇంజనీర్ లేనే లేడా. ఇంత టెక్నాలజీ పెరిగినా వాటిని ఉపయోగించుకోలేక పోతున్నామా. ఇది ప్రభుత్వ లోపం కాదా!
Techieride NGO distributing food items to the flood effected area Meerpet

పాలిథిన్ వాడి బయట పడేయటం వల్ల అది భూమి పొరలలొనే ఉండిపోయి నీరు భూమిలోకి ఇంకకుండా అడ్డుపడుతూనే ఉన్నాయి. కాలువలు, చెరువులు, నదులు ఎక్కడచూసినా ప్లాస్టిక్ మయం. ప్రభుత్వం 50 మైక్రాన్స్ వరకు బంద్ చేసాము అని చెబుతుంది. కానీ అవి బయట విరివిగా దొరుకుతూనే ఉన్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు, ఏదో నామ మాత్రానికి మొదట్లో కొన్ని చర్యలు చేపట్టి ఏదో చేసేసాం అని చేతులు దులుపేసుకుంది. ప్రభుత్వం దీనిని ఎందుకు బందు చేయలేకపోతుంది. ఇది కూడా ప్రభుత్వ లోపం కాదా!

ప్రజల లోపాలు:

మనం మన భాద్యత ఎంత వరకు నిర్వర్తిస్తున్నాము. కుంటలు, చెరువుల ప్రక్కన మనం ఇల్లు కట్టుకుంటూ దోమలు వస్తున్నాయి, వాసన వస్తుంది అని మనమే ఆ కుంటలు, చెరువులు వద్దు అని వాటిని మూసేయాలి అని అంటున్నారు. ఇలా మూసేయాలి అనటం ఎంతవరకు కరెక్టు.

ప్రతీ ఒక్కరు ఏదో ఒక కారణంగా ఉన్న చెట్లను నరికి వేస్తున్నారు. ఒకరు చెట్లు ఉంటే మా ఇంటి గోడలు పగిలిపోతాయని, మా షాప్ లేదా ఇల్లు కనపడుట లేదు అని తీసేస్తున్నారు. కొందరైతే అసలు చెట్లను, కనీసం మొక్కలను కూడా పెంచటంలేదు. మరి రోడ్డు మీద పడే నీరు భూమిలోకి ఎలా ఇంకుతుంది. ఆ చెట్లే కదా నీటిని తీసుకొని భూమిలోకి పంపేది. ఇది ప్రజల బాధ్యత కాదా!

చాలామంది నీటుగా ఉండాలని వారి ఇంటిముందు మొత్తం ఫ్లోరింగ్ చేయిస్తున్నారు. మరి రోడ్డు మీద పారే నీరు భూమిలోకి ఎలా ఇంకుతుంది. ఆ నీరు డ్రైనేజీ లోకి వెళ్తే మొత్తం మట్టి, చెత్తతో నిండిపోతుంది. కొందరైతే చెత్తను కూడా డ్రైనేజీ లొనే వేస్తుంటారు, ఇంకొందరు ఇంట్లో ఉండే బాసాండ్ల చెత్తను, అంట్లను కూడా గచ్చులోనో నుండి డ్రైనేజీ లోకి పంపుతుంటారు. ఇది మనం చేసే తప్పులు కాదా!

Flood in Hyderabad in Oct, 2020

ప్రతీ ఒక్క ఇంటికి కనీసం ఒక్క ఇంకుడుగుంత అయినా ఉండాలి. అదే అపార్టుమెంటుకు ప్రదేశాన్ని బట్టి రెండు లేక మూడు ఇంకుడుగుంతలు ఉండాలి. మరి ఎంత మంది ఇళ్లలో ఇంకుడుగుంతలు ఉన్నాయి. వర్షము వచ్చినపుడు మిద్ద మీద పడ్డ నీరు ఇంకుడుగుంతల ద్వారా భూమిలోకి వెళ్ళాలి, కానీ అవి రోడ్డు మీద పారుతూ ఉంటాయి. ప్రతీ ఒక్కరు ఏదో ఒక సాకుతో ఇంకుడుగుంతలు కట్టించుకోరు. కానీ బోరు వేయించుకోవటానికి, పార్కింగుకు, డిజైన్ చేయించుకోవడానికి కేటాయిస్తారు కానీ ఇంకుడుగుంత మాత్రం ఉండదు. మరి ఇది ప్రజల తప్పులు కాదా!

ఇన్ని తప్పులు ప్రజలు, ప్రభుత్వ అధికారులు చేస్తూ అటు ప్రకృతిని దూషించటం ఎంతవరకు న్యాయం.

కొద్దిగా ఆలోచించండి. ఇప్పటికైనా మేల్కొండి.

Tuesday, September 15, 2020

Love bonding with Pets or Animals

Love bonding with Pets or Animals

 
Animal bond with humans are the most amazing ones.. they teach us the real meaning of pure love.. just giving without any expectation.. they teach us to live in the moment and be grateful for everything around.
 

There needs to be proper homework done before getting a pet as we do while we expect a human kid.. We plan in advance.. our time.. our expenses and welcome the new member.. Same stands true for pets.. one needs to know as much as possible before adding a fur kid to the family.. the intention with which the pet is got home matters a lot as well. Also not to forget it's always the dog who choose their humans and not the other way.

Rescue...

As far as rescues are concerned it's again helping an animal in distress.. we do come forward to help humans who met an accident the same thing applies for animals. Humans have the ability to help other creatures.. we should be grateful to be vested with such powers and utilize it accordingly.. should practice empathy.
 

Caring... 


Animals demand as much time as any human kid.. they are full of energy and we need to burn that out if we do not want them to do something which isn't supposed to out of boredom.. have a set timetable.. playtime or walk-time and follow the same.. it can be a short duration but this quality time with your pets goes a long way. Also, there are a lot of enrichment activities one can do at home where it's mostly their brain that works and keeps them busy.

Precautions

Precautions, before you get an animal home, would be being ready for a lifetime commitment (at least for the next 12-15yrs) and treat them as another living being and not as a commodity.. Everyone in the family needs to be consulted and should absolutely love them before getting a dog/cat home, they need time.. patience.. and funds (vaccines/neutering/food/bed/toys/bath essentials, etc) for the same.
 

About the author...

I am a working professional.. have 2 fur kids and a human kid.. it's quite a task to divide your time and spread it equally but then I am just waiting for my human kid to grow a little so that all the time I have can be spent together with all.. my fur kids totally love my 9 months old human kid.. I also have been into animal rescue.. foster and adoption facilitation for quite long now.. Founder of Bellyfills pet food and boarding ( www.bellyfills.com ).

I am a nature and animal communicator (through telepathy) and this has also helped me to a large extent to understand them better and ask them before deciding on their behalf.

 

Author

Prerana
Hyderabad