Saturday, May 15, 2021

భయమే మరణం

భయమే మరణం


Image from Training Journal

కరోనా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మరి అది నిజంగానే వ్యాపిస్తూ ఉందా లేక వాళ్లకు కరోనా వచ్చింది, వీళ్లకు కరోనా వచ్చింది అని భయమే ఎక్కువ అయ్యి మనమే భయంతో ఏ సమస్య వచ్చినా కరోనానే అని బయపడి ప్రాణం మీదికి తెచుకుంటున్నమా. ఒకవేళ కరోనా వచ్చినా చాలామంది కోలుకుని మళ్ళీ మామూలు స్థితికి వస్తున్నారు, ఎక్కడో ఒకచోట ప్రాణం కోల్పోతున్నారు, ఆ ఒక్కరిని చూసి మనం మన ప్రాణాలను కూడా కోల్పోతున్నాము.

నిజంగా ఆ కరోనా మనిషిని చంపే అంత పెద్దదా... కాదు, నాకు తెలిసి ఈ భూప్రపంచంలో మనిషిని మించిన పెద్ద వైరస్ ఇంకో జీవి లేదు, ఎందుకంటే వాటి కంటే మనకు ఆలోచన మరియు మాట్లాడే గొప్ప వరాలు ఉన్నాయి. మరి అన్నిటిని సాధించిన మనిషి ఈ చిన్న వైరస్ కు భయపడితే ఎలా. ఇప్పటివరకు ఎన్నో వైరస్ లు వచ్చాయి, వాటన్నిటినీ జయిస్తూ వచ్చాము. ఇదీ అంతే, పోరాడుదాం, ధైర్యంతో ఎదురుకొందాం. ఈ న్యూస్ లు, పేపర్ లో చూసి ఇంత మంది పోయారు, అంత మంది పోయారు అని ఆలోచించకుండా, మనం వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించండి, మీలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. ఇప్పుడు కరోనా.. రేపు ఇంకోటి రావొచ్చు..

Image from Real Life Counseling

మరి దాన్ని ఎలా ఎదుర్కొంటాం, ఇప్పటికైనా మారుదాం, మన జీవనశైలినిఆహారాన్ని మార్చుకుందాం. ఎలాంటి వైరస్ ని అయిన ఎదుర్కొందాం. దైర్యంగా ఉందాం, భయంతో చస్తూ బ్రతకవద్దు. భయమే మరణం, ఆ భయమే మన రోగ నిరోధక శక్తిని హరించివేస్తుంది. 

అనవసర అపోహలకు పోవద్దు, తొందరపడి ఏదో అవుతుంది అని కంగారుపడవద్దు. తొందరలో ఏ మందులు పడితే అవి వాడవద్దు. డాక్టర్ చెబితేనే వాడండి. చేతులు కాలి నాక ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నించవద్దు. ముందు జాగ్రత్తగా ఉండి మంచి పౌష్టికాహారం తీసుకొని, సంతోషంగా ఉండండి. ఇంట్లో ఉండి వేరే విషయాల గురుంచి ఎక్కువగా ఆలోచించకండి. మీ గురించి, మీ కుటుంబం గురించి మంచి ఆలోచనలు చేయండి. మీలో రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. ఇప్పటి వరకు చేసిన తప్పులను గ్రహించుకోండి, వాటిని మార్చుకోవడానికి ప్రయత్నించండి. 

దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితాన్ని మంచిగా మలుచుకుందాం. అన్నిటికి ఉద్రిక్తత చెందకుండా నిమ్మలంగా ఆలోచనతో ముందుకుపోదాం.

ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు, అలా అని భయపడుతూ పోదామా. చివరి వరకు పోరాడుదాం, మనిషి బలవంతుడు అని నిరూపించుదాం.

4 comments:

  1. Very good message Naveen. ఇలాంటి సమయం లో మన కర్తవ్యం ఏంటి ఆని క్లియర్ గా చెప్పారు.

    ReplyDelete