కరోనా 2 వేవ్
కరోనా 2 వేవ్... వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది. మరి ఏమి చేయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు నీటి వలన, ఇంకొందరు గాలి వలన వ్యాపిస్తోంది అని చెప్తున్నారు. మాస్క్, సానిటైజర్, సోషల్ డిస్టెన్స్ నియమాలు పాటిస్తే చాలా! ఇవి ఎంత వరకు కాపాడగలుగుతాయి. అసలు ఇవి నిజంగా సాధ్యమేనా.Stay Home and Stay Safe... అని అందరూ అంటున్నారు. మరి ఇంట్లో ఉంటే ఆ వైరస్ అంటకుండా ఉంటదా. మరి ఇంట్లో ఉంటే మన పనులు ఎవరు చేయాలి, ఎలా చేసుకోవాలి. ఎన్ని రోజులు ఇలా చేయాలి... ఇప్పటికైనా ఆలోచించాల్సిన విషయం.
కరోనా ఎలా ఉంటది. దాని వల్ల వచ్చే లక్షణాలు ఇప్పటివరకు ఎవరైనా నిర్దేశించారా! ప్రపంచం మొత్తం భయపడుతూనే ఉంది, కానీ ఏమీ చేయలేకపోతుంది. కంటికి కనపడని వైరస్ తో పోరాడుతున్నాము. కనీసం కనపడుతుంటే అన్నా వాటితో పోరాడవచ్చు, లేదా మన ఇంటికి రాకుండా తలుపు, కిటికీ, మరియు గేట్ మూసేయా వచ్చు.
కొందరైతే ఏ లక్షణాలు కనపడ్డా వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకుంటున్నారు. కరోనా అని తెలియగానే హాస్పిటల్ లో అడ్మిట్ అయి నానా తిప్పలు పడుతున్నారు, ఇప్పుడు చూస్తే అసలు హాస్పిటల్ లో బెడ్స్ కూడా దొరకని పరిస్థితి ఉంది. హాస్పిటల్ కు వెళ్ళటానికి ఉండే ఉత్సహం మంచి ఆహారం, మంచి అలవాట్లు చేసుకోవటానికి జనాలకు తీరిక దొరకటం లేదు. ఎంత విచిత్రం. మరి ఆ హాస్పిటల్ లో ఇచ్చే ఆంటీ బయటిక్స్ కు ఎంత మంది తట్టుకోగలుతున్నారు. అలాంటి పెద్ద మొత్తంలో ఖర్చుకు కూడా జనాలు వెనకాడటం లేదు, కానీ ఎంతో సింపుల్ గా ఉండే మంచి జీవన విధానం అలవాటు చేసుకోలేకపోతున్నారు.
అప్పుడో ఇప్పుడో కొద్దిగా డాక్టర్ల నోటా, కొందరు నిపుణులు చెప్తున్న మాట రోగ నిరోధక శక్తి (ఇమ్మ్యూనిటి పవర్). మరి రోగ నిరోధక శక్తి పెరగటానికి ఎవరు సరిగా చెప్పరే. చెప్పే కొందరు నిపుణులను ఎవరు పట్టించుకోరే. టాబ్లెట్స్, వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుందా. అవి ఎప్పటి వరకు కాపాడగలుగుతాయి. ఇంకొందరు ప్రోటీన్ పేరుతో చికెన్, గుడ్డు... తినాలని డాక్టర్లతో సహా చెప్తున్నారు, అసలు జ్వరం వస్తేనే ఏమి తినవద్దు, త్వరగా జీర్ణం అయ్యేవి తినాలని చెప్తారు లేదా బ్రెడ్ పాలు త్రాగండి అని అంటారు, మరి నాన్ వెజ్ ఎలా అరుగుతుంది ఆ టైంలో. అసలే జీర్ణ వ్యవస్థ ఆ టైంలో పనిచేయడానికి కూడా సహకరించదు. మరి అవి తినమని ఎలా సలహా ఇస్తున్నారు. పాపం కొందరు తెలియక కరోనా రాగానే, లేదా వస్తుంది అని చికెన్, గుడ్లు తెగ తినేస్తున్నారు. మరి అదే ప్రోటీన్ కురాగాయలల్లో లేవా... ఒకసారి ఆలోచించండి మిత్రులారా. నిజాన్ని గ్రహించండి.
ఏంటి వీడు ఏదో సోది చెప్తున్నాడు అని అనుకోకండి. అందరూ చివరి వరకు మొత్తం చదవండి, విషయాన్ని గ్రహించండి, ఇప్పటికైనా మేల్కొనండి. మనల్ని కాపడేది ఒక మన రోగ నిరోధక శక్తి మాత్రమే. మరి ఒక్క రోజులో రోగ నిరోధక శక్తి పెరుగుతుందా అనే అనుమానం వస్తుంది. దాని గురుంచి మీరు అంతగా ఆలోచించవద్దు. మీరు క్రమం తప్పకుండా ఈ క్రింద చెప్పే విషయాలు పాటించండి, పాటించిన తర్వాత మీకే తెలుస్తుంది మనలో రోగ నిరోధక శక్తి ఎలా పెరుగుతుందో. ఇది ఏదో కొద్దీ రోజులు పాటించేవి కాదు, మనం నిత్యం అలవాటు చేసుకోవాల్సిన విషయాలు... ఇవి మారిపోయాయి కనుకే మనకు ఇలాంటి విచిత్రమైన రోగాలు వస్తున్నాయి. మరి రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఏమి చేయాలి.
ముందుగా మనం చేయవలసినది ఈ రెండు మాత్రమే ఒకటి మన జీవన విధానం మంచిగా మార్చుకోవడం, రెండవది మనం తినే ఆహారం మరియు తినే విధానం. ఇవి మారితేనే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
పాటించవలసిన నియమాలు...
1. నిద్ర లేవగానే పడగడపున ఒకటి లేదా ఒకటిన్నర లీటర్ల నీటిని త్రాగండి.2. రోజు మొత్తంలో నాలుగు నుండి ఐదున్నర లీటర్ల నీటిని త్రాగటానికి ప్రయత్నించండి.
3. ఉదయం అల్పాహారంలో పండ్లు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ లేదా మొలకెత్తిన విత్తనాలు మాత్రమే తీసుకోండి.
4. కుదిరితే రోజుకు రెండు పూటలే తినేటట్టు చూసుకోండి.
5. రాత్రి భోజనం త్వరగా చేసేటట్టు చూసుకోండి, అంటే.. కుదిరితే సాయంత్రం 6.30 లేదా 7 లోపే తినేయండి.
6. రోజు 60 నుంచి 70% నేచురల్ పదార్థాలు బాడీలోకి వెళ్ళేటట్టు చూసుకోండి. అంటే పండ్లు, పండ్ల రసాలు, కూరగాయల రసాలు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, మొలకెత్తిన విత్తనాల రూపంలో వెళ్లేటట్టు చూసుకోండి.
7. రోజు వ్యాయామం, బ్రీతింగ్ వ్యాయామాలు, ఆసనాలు, ధ్యానం (మెడిటేషన్) చేయండి.
8. దైర్యంగా, ఉల్లాసంగా ఉండండి, మంచి ఆలోచనలతో ఉత్సహంగా ఉండటానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు.
9. జంక్ ఫుడ్, చెడు వ్యాసనాలు మానేయటానికి ప్రయత్నించండి.
ఇంకా ఏమైనా విషయాలు కావాలన్న, ఎలా పాటించాలి అన్నా నన్ను సంప్రదించవచ్చు (నవీన్ 9959941110), నేను మీకు సహాయం చేస్తాను.
ఒకవేళ కరోనా వచ్చినా ఈ క్రింద ఉన్న లింక్ లో పేర్కొన్న విషయాలు పాటించండి. ఒకవేళ డాక్టర్ల సలహా మేరకు మెడిసిన్ వాడుతూ కూడా ఈ ఆహార నియమాలు పాటించవచ్చు. తింటేనే ఆహారం అనుకోవద్దు. రసాల రూపంలో కూడా ఆహారమే అవుతుంది అని గ్రహించండి.
No comments:
Post a Comment