Saturday, May 15, 2021

భయమే మరణం

భయమే మరణం


Image from Training Journal

కరోనా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. మరి అది నిజంగానే వ్యాపిస్తూ ఉందా లేక వాళ్లకు కరోనా వచ్చింది, వీళ్లకు కరోనా వచ్చింది అని భయమే ఎక్కువ అయ్యి మనమే భయంతో ఏ సమస్య వచ్చినా కరోనానే అని బయపడి ప్రాణం మీదికి తెచుకుంటున్నమా. ఒకవేళ కరోనా వచ్చినా చాలామంది కోలుకుని మళ్ళీ మామూలు స్థితికి వస్తున్నారు, ఎక్కడో ఒకచోట ప్రాణం కోల్పోతున్నారు, ఆ ఒక్కరిని చూసి మనం మన ప్రాణాలను కూడా కోల్పోతున్నాము.

నిజంగా ఆ కరోనా మనిషిని చంపే అంత పెద్దదా... కాదు, నాకు తెలిసి ఈ భూప్రపంచంలో మనిషిని మించిన పెద్ద వైరస్ ఇంకో జీవి లేదు, ఎందుకంటే వాటి కంటే మనకు ఆలోచన మరియు మాట్లాడే గొప్ప వరాలు ఉన్నాయి. మరి అన్నిటిని సాధించిన మనిషి ఈ చిన్న వైరస్ కు భయపడితే ఎలా. ఇప్పటివరకు ఎన్నో వైరస్ లు వచ్చాయి, వాటన్నిటినీ జయిస్తూ వచ్చాము. ఇదీ అంతే, పోరాడుదాం, ధైర్యంతో ఎదురుకొందాం. ఈ న్యూస్ లు, పేపర్ లో చూసి ఇంత మంది పోయారు, అంత మంది పోయారు అని ఆలోచించకుండా, మనం వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించండి, మీలో ఉన్న రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. ఇప్పుడు కరోనా.. రేపు ఇంకోటి రావొచ్చు..

Image from Real Life Counseling

మరి దాన్ని ఎలా ఎదుర్కొంటాం, ఇప్పటికైనా మారుదాం, మన జీవనశైలినిఆహారాన్ని మార్చుకుందాం. ఎలాంటి వైరస్ ని అయిన ఎదుర్కొందాం. దైర్యంగా ఉందాం, భయంతో చస్తూ బ్రతకవద్దు. భయమే మరణం, ఆ భయమే మన రోగ నిరోధక శక్తిని హరించివేస్తుంది. 

అనవసర అపోహలకు పోవద్దు, తొందరపడి ఏదో అవుతుంది అని కంగారుపడవద్దు. తొందరలో ఏ మందులు పడితే అవి వాడవద్దు. డాక్టర్ చెబితేనే వాడండి. చేతులు కాలి నాక ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నించవద్దు. ముందు జాగ్రత్తగా ఉండి మంచి పౌష్టికాహారం తీసుకొని, సంతోషంగా ఉండండి. ఇంట్లో ఉండి వేరే విషయాల గురుంచి ఎక్కువగా ఆలోచించకండి. మీ గురించి, మీ కుటుంబం గురించి మంచి ఆలోచనలు చేయండి. మీలో రోగ నిరోధక శక్తిని పెంచుకోండి. ఇప్పటి వరకు చేసిన తప్పులను గ్రహించుకోండి, వాటిని మార్చుకోవడానికి ప్రయత్నించండి. 

దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితాన్ని మంచిగా మలుచుకుందాం. అన్నిటికి ఉద్రిక్తత చెందకుండా నిమ్మలంగా ఆలోచనతో ముందుకుపోదాం.

ఎప్పుడో ఒకప్పుడు మరణం తప్పదు, అలా అని భయపడుతూ పోదామా. చివరి వరకు పోరాడుదాం, మనిషి బలవంతుడు అని నిరూపించుదాం.

Sunday, May 2, 2021

రక్షణ వ్యవస్థ బలంగా ఉండాలంటే | How to improve immunity system

రక్షణ వ్యవస్థ బలంగా ఉండాలంటే

Image from News Medical Life Sciences

కరోనా వైరస్ కావొచ్చు లేదా ఎలాంటి వైరస్ లు మన మీద ప్రభావం చూపకుండా రక్షించబడాలంటే మన బాడీ లో రక్షణ వ్యవస్థ బలంగా ఉండాలి. ఆ రక్షణ వ్యవస్థ బలంగా ఉండాలంటే ముందుగా మూడు విషయాలు గుర్తించుకోవాలి.
ఒకటి ఎలాంటి పరిస్థితిలోనైనా ధైర్యాన్ని కోల్పోకూడదు. రెండవది మన జీవన విధానం మంచిగా మార్చుకోవడం, మూఢవది మనం తినే ఆహారం మరియు తినే విధానం. ఇవి మారితేనే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

రోగ నిరోధక శక్తి పెరగడానికి మనం రోజూ పాటించవలసిన నియమాలు...
1. నిద్ర లేవగానే పడగడపున ఒకటి లేదా ఒకటిన్నర లీటర్ల నీటిని త్రాగండి. కాలకృత్యాలు తీర్చుకోండి.
2. రోజు ఒక గంట వ్యాయామం, బ్రీతింగ్ వ్యాయామాలు, ఆసనాలు, ధ్యానం (మెడిటేషన్) చేయండి.
4. ఉదయం ఒక వెజిటబుల్ జ్యూస్ (క్యారెట్ బీట్ రూట్ కీరా, బీర, సొర, పొట్ల, నిమ్మ, పుదీనా కొత్తిమీర మొదలగున్నవి) త్రాగండి.
5. ఉదయం అల్పాహారంలో పండ్లు (ముఖ్యంగా సి విటమిన్ ఉన్న పండ్లు తినండి... ఉదాహరణకు జామ పండ్లు), డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ లేదా మొలకెత్తిన విత్తనాలు మాత్రమే తీసుకోండి.
6. మధ్యాహ్నం భోజనం 12 నుండి 1 గంట లోపే తినేయండి.
7. భోజనం తినేటప్పుడు ఒక నియమం పాటించండి. భోజనానికి అరగంట ముందు రెండు గ్లాసుల నీళ్లు త్రాగండి, భోజనం తినేటప్పుడు నీళ్లు త్రాగకండి, తిన్న తర్వాత ఒక బుక్క నీళ్లు మాత్రమే త్రాగండి. ఆ తర్వాత రెండు గంటల తర్వాత మాత్రమే నీళ్లు సరిపడా త్రాగండి. ఆ తర్వాత గంట గంటకు ఒకటి లేదా రెండు గ్లాసుల చొప్పున నీళ్లు త్రాగుతూ ఉండండి.
8. భోజనం చేసేటప్పుడు 50% కూరగాయలు (కర్రీస్) ఉండేటట్టు చూసుకోండి. కర్రీస్ లలో ఉప్పు నూనెలు తక్కువగా ఉంటే ఎక్కువ మొత్తంలో కూరగాయలు తినగలుగుతాం.
9. సాయంత్రం నాలుగు గంటలకు ఏదైనా ఒక గ్లాస్ పండ్ల రసం త్రాగండి. కుదరకపోతే ఒక గ్లాస్ మజ్జిగ నన్నా త్రాగండి.
10. సాయంత్రం ఐదు ఐదున్నర గంటలకు నాలుగు గ్లాసుల నీళ్లు త్రాగి మోషన్ కి వెళ్ళండి, ఇలా చేస్తే మన లోపల ప్రేగులు మంచిగా క్లీన్ అవుతాయి, ఆకలి బాగావేస్తుంది. అంటే రోజులో రెండు సార్లు అయినా మోషన్ కంపల్సరీ గా వెళ్ళండి.
11. రాత్రి భోజనం త్వరగా చేసేటట్టు చూసుకోండి, అంటే.. సాయంత్రం 6.30 లేదా 7 లోపే తినేయండి.
12. రోజు 60 నుంచి 70% నేచురల్ పదార్థాలు బాడీలోకి వెళ్ళేటట్టు చూసుకోండి. అంటే పండ్లు, పండ్ల రసాలు, కూరగాయల రసాలు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, మొలకెత్తిన విత్తనాల రూపంలో వెళ్లేటట్టు చూసుకోండి.
13. రోజు మొత్తంలో నాలుగు నుండి ఐదున్నర లీటర్ల నీటిని త్రాగటానికి ప్రయత్నించండి.
14. దైర్యంగా, ఉల్లాసంగా ఉండండి, మంచి ఆలోచనలతో ఉత్సహంగా ఉండటానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు.
16. జంక్ ఫుడ్, చెడు వ్యాసనాలు మానేయటానికి ప్రయత్నించండి.

పైన చెప్పిన విషయాలు మీరు పాటిస్తే ఎలాంటి వైరస్ లతో నైనా మీ బాడీ పోరాడటానికి రెడీగా ఉంటుంది.

🙏

కరోనా సెకండ్ వేవ్ విషయంలో జాగ్రత్త | Be careful on Corona Second Wave



 
అందరికి విజ్ఞప్తి,

కరోనా సెకండ్ వేవ్ విషయంలో జాగ్రత్త వహించండి. ముందుగా ఎవరు బయపడవద్దు. ధైర్యంగా ఉండండి, వైరస్ కన్నా బలవంతుడు మనిషి. మీరు దైర్యంగా ఉంటే వైరస్ మిమ్మల్ని ఏమి చేయదు. మీలో రోగ నిరోధక శక్తి ఉన్నంత వరకు ఏ వైరస్ మిమ్మల్ని ఏమి చేయదు. పాజిటివ్ వచ్చింది కదా అని తొందరపడి హాస్పిటల్ కి వెళ్లవద్దు. అన్నిటిని అవలోకనం చేసుకున్నాకే, తప్పని సరి అయితేనే హాస్పిటల్ కి వెళ్ళండి. లేకపోతే ఇంటి వద్దనే తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఊరికనే కోవిడ్ టెస్ట్ చేయించుకోవద్దు. జలుబు, దగ్గు, జ్వరం వేరే వైరస్ వల్ల కూడా రావచ్చు.

కరోనా వచ్చిన వాళ్ళను దూరం పెట్టి అంటరాని వాల్లలాగా చూడవద్దు, వాళ్లకు సరైన పోషక విలువైన ఆహారాన్ని అందించండి. రోగ నిరోధక శక్తిని పెంచటానికి ప్రయత్నించండి.

అసలు తప్పు జరుగుతున్నది మీడియా చెప్పే న్యూస్ వల్లనే.

కరోనా విషయం లో తీసుకోవలసిన ముఖ్యమైన విషయాలు...

1. టీవీ, మీడియా, పేపర్ చూడటం ఆపేయండి కొన్ని రోజులు. కావాలంటే మంచి ప్రోగ్రామ్స్, సినిమాలు చూడండి.
2. మంచిగా ఇంట్లోనే ధ్యానం చేయండి.
3. బ్రీతింగ్ వ్యాయామాలు చేయండి
4. పౌష్టికాహారం తీసుకోండి. మనం ఇప్పుడు తింటున్న ఆహారం సరైనది కాదు. అవి ఏమి తినాలి, ఎలా తినాలో తెలుసుకోండి.
5. మన జీవన విధానాన్ని మార్చుకోండి.

మాస్క్, సానీటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటించకున్నా పర్లేదు కానీ (అంటే పాటించవద్దు అని కాదు, పైన చెప్పిన విషయాలు ఇంకా ముఖ్యమని దాని అర్ధం), పైన చెప్పిన విషయాలు పాటించండి. 

నవీన్ వల్లోజు
TechnoSpoorthi🙏