Sunday, May 2, 2021
కరోనా సెకండ్ వేవ్ విషయంలో జాగ్రత్త | Be careful on Corona Second Wave
Monday, April 19, 2021
కరోనా 2 వేవ్ | Conora 2nd Wave
కరోనా 2 వేవ్
కరోనా 2 వేవ్... వైరస్ మళ్ళీ విజృంభిస్తోంది. మరి ఏమి చేయాలి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరు నీటి వలన, ఇంకొందరు గాలి వలన వ్యాపిస్తోంది అని చెప్తున్నారు. మాస్క్, సానిటైజర్, సోషల్ డిస్టెన్స్ నియమాలు పాటిస్తే చాలా! ఇవి ఎంత వరకు కాపాడగలుగుతాయి. అసలు ఇవి నిజంగా సాధ్యమేనా.Stay Home and Stay Safe... అని అందరూ అంటున్నారు. మరి ఇంట్లో ఉంటే ఆ వైరస్ అంటకుండా ఉంటదా. మరి ఇంట్లో ఉంటే మన పనులు ఎవరు చేయాలి, ఎలా చేసుకోవాలి. ఎన్ని రోజులు ఇలా చేయాలి... ఇప్పటికైనా ఆలోచించాల్సిన విషయం.
కరోనా ఎలా ఉంటది. దాని వల్ల వచ్చే లక్షణాలు ఇప్పటివరకు ఎవరైనా నిర్దేశించారా! ప్రపంచం మొత్తం భయపడుతూనే ఉంది, కానీ ఏమీ చేయలేకపోతుంది. కంటికి కనపడని వైరస్ తో పోరాడుతున్నాము. కనీసం కనపడుతుంటే అన్నా వాటితో పోరాడవచ్చు, లేదా మన ఇంటికి రాకుండా తలుపు, కిటికీ, మరియు గేట్ మూసేయా వచ్చు.
కొందరైతే ఏ లక్షణాలు కనపడ్డా వెంటనే హాస్పిటల్ కి వెళ్లి చెక్ చేయించుకుంటున్నారు. కరోనా అని తెలియగానే హాస్పిటల్ లో అడ్మిట్ అయి నానా తిప్పలు పడుతున్నారు, ఇప్పుడు చూస్తే అసలు హాస్పిటల్ లో బెడ్స్ కూడా దొరకని పరిస్థితి ఉంది. హాస్పిటల్ కు వెళ్ళటానికి ఉండే ఉత్సహం మంచి ఆహారం, మంచి అలవాట్లు చేసుకోవటానికి జనాలకు తీరిక దొరకటం లేదు. ఎంత విచిత్రం. మరి ఆ హాస్పిటల్ లో ఇచ్చే ఆంటీ బయటిక్స్ కు ఎంత మంది తట్టుకోగలుతున్నారు. అలాంటి పెద్ద మొత్తంలో ఖర్చుకు కూడా జనాలు వెనకాడటం లేదు, కానీ ఎంతో సింపుల్ గా ఉండే మంచి జీవన విధానం అలవాటు చేసుకోలేకపోతున్నారు.
అప్పుడో ఇప్పుడో కొద్దిగా డాక్టర్ల నోటా, కొందరు నిపుణులు చెప్తున్న మాట రోగ నిరోధక శక్తి (ఇమ్మ్యూనిటి పవర్). మరి రోగ నిరోధక శక్తి పెరగటానికి ఎవరు సరిగా చెప్పరే. చెప్పే కొందరు నిపుణులను ఎవరు పట్టించుకోరే. టాబ్లెట్స్, వ్యాక్సిన్ వేయించుకుంటే సరిపోతుందా. అవి ఎప్పటి వరకు కాపాడగలుగుతాయి. ఇంకొందరు ప్రోటీన్ పేరుతో చికెన్, గుడ్డు... తినాలని డాక్టర్లతో సహా చెప్తున్నారు, అసలు జ్వరం వస్తేనే ఏమి తినవద్దు, త్వరగా జీర్ణం అయ్యేవి తినాలని చెప్తారు లేదా బ్రెడ్ పాలు త్రాగండి అని అంటారు, మరి నాన్ వెజ్ ఎలా అరుగుతుంది ఆ టైంలో. అసలే జీర్ణ వ్యవస్థ ఆ టైంలో పనిచేయడానికి కూడా సహకరించదు. మరి అవి తినమని ఎలా సలహా ఇస్తున్నారు. పాపం కొందరు తెలియక కరోనా రాగానే, లేదా వస్తుంది అని చికెన్, గుడ్లు తెగ తినేస్తున్నారు. మరి అదే ప్రోటీన్ కురాగాయలల్లో లేవా... ఒకసారి ఆలోచించండి మిత్రులారా. నిజాన్ని గ్రహించండి.
ఏంటి వీడు ఏదో సోది చెప్తున్నాడు అని అనుకోకండి. అందరూ చివరి వరకు మొత్తం చదవండి, విషయాన్ని గ్రహించండి, ఇప్పటికైనా మేల్కొనండి. మనల్ని కాపడేది ఒక మన రోగ నిరోధక శక్తి మాత్రమే. మరి ఒక్క రోజులో రోగ నిరోధక శక్తి పెరుగుతుందా అనే అనుమానం వస్తుంది. దాని గురుంచి మీరు అంతగా ఆలోచించవద్దు. మీరు క్రమం తప్పకుండా ఈ క్రింద చెప్పే విషయాలు పాటించండి, పాటించిన తర్వాత మీకే తెలుస్తుంది మనలో రోగ నిరోధక శక్తి ఎలా పెరుగుతుందో. ఇది ఏదో కొద్దీ రోజులు పాటించేవి కాదు, మనం నిత్యం అలవాటు చేసుకోవాల్సిన విషయాలు... ఇవి మారిపోయాయి కనుకే మనకు ఇలాంటి విచిత్రమైన రోగాలు వస్తున్నాయి. మరి రోగ నిరోధక శక్తి పెరగాలంటే ఏమి చేయాలి.
ముందుగా మనం చేయవలసినది ఈ రెండు మాత్రమే ఒకటి మన జీవన విధానం మంచిగా మార్చుకోవడం, రెండవది మనం తినే ఆహారం మరియు తినే విధానం. ఇవి మారితేనే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
పాటించవలసిన నియమాలు...
1. నిద్ర లేవగానే పడగడపున ఒకటి లేదా ఒకటిన్నర లీటర్ల నీటిని త్రాగండి.2. రోజు మొత్తంలో నాలుగు నుండి ఐదున్నర లీటర్ల నీటిని త్రాగటానికి ప్రయత్నించండి.
3. ఉదయం అల్పాహారంలో పండ్లు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ లేదా మొలకెత్తిన విత్తనాలు మాత్రమే తీసుకోండి.
4. కుదిరితే రోజుకు రెండు పూటలే తినేటట్టు చూసుకోండి.
5. రాత్రి భోజనం త్వరగా చేసేటట్టు చూసుకోండి, అంటే.. కుదిరితే సాయంత్రం 6.30 లేదా 7 లోపే తినేయండి.
6. రోజు 60 నుంచి 70% నేచురల్ పదార్థాలు బాడీలోకి వెళ్ళేటట్టు చూసుకోండి. అంటే పండ్లు, పండ్ల రసాలు, కూరగాయల రసాలు, డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, మొలకెత్తిన విత్తనాల రూపంలో వెళ్లేటట్టు చూసుకోండి.
7. రోజు వ్యాయామం, బ్రీతింగ్ వ్యాయామాలు, ఆసనాలు, ధ్యానం (మెడిటేషన్) చేయండి.
8. దైర్యంగా, ఉల్లాసంగా ఉండండి, మంచి ఆలోచనలతో ఉత్సహంగా ఉండటానికి ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవద్దు.
9. జంక్ ఫుడ్, చెడు వ్యాసనాలు మానేయటానికి ప్రయత్నించండి.
ఇంకా ఏమైనా విషయాలు కావాలన్న, ఎలా పాటించాలి అన్నా నన్ను సంప్రదించవచ్చు (నవీన్ 9959941110), నేను మీకు సహాయం చేస్తాను.
ఒకవేళ కరోనా వచ్చినా ఈ క్రింద ఉన్న లింక్ లో పేర్కొన్న విషయాలు పాటించండి. ఒకవేళ డాక్టర్ల సలహా మేరకు మెడిసిన్ వాడుతూ కూడా ఈ ఆహార నియమాలు పాటించవచ్చు. తింటేనే ఆహారం అనుకోవద్దు. రసాల రూపంలో కూడా ఆహారమే అవుతుంది అని గ్రహించండి.
Tuesday, November 10, 2020
హైదరాబాద్ లో వరద బీభత్సం
హైదరాబాద్ లో వరద బీభత్సం:
Techieride NGO team helping the people to take safe place |
ప్రభుత్వ లోపాలు:
Techieride NGO distributing food items to the flood effected area Meerpet |
ప్రజల లోపాలు:
Flood in Hyderabad in Oct, 2020 |
Tuesday, September 15, 2020
Love bonding with Pets or Animals
Love bonding with Pets or Animals
Rescue...
About the author...
Author
PreranaHyderabad
Tuesday, August 25, 2020
వైరస్ లతో పోరాడటం ఎలా?
వైరస్ లతో పోరాడటం ఎలా?
Image from india.com |
లంఖణం పరమౌషధం
Friday, August 7, 2020
How to take precautions when we are having Corona or any other virus
To protect from Corona:
Requesting who are having Corona or who feel Corona symptoms:
Image from amarujala |
First and foremost, don’t be afraid. When we are scared, some chemicals are released in our brain which makes us feel that no food or medicine is working properly. Corona is also like a normal fever, but you should not be careless. If you have any fever, cold, cough, headache, do the following.
Thursday, July 9, 2020
కరోన మహమ్మారి.... రోగనిరోధక శక్తి ఒక్కటే దీనికి పరిష్కారం
కరోన
మహమ్మారి....
ఏంటి ఈ జీవితం. ఏనాడైనా అనుకున్నామ ఇలాంటి జీవితం గడుపుతామని. మూతికి గుడ్డ కట్టుకొని, దెగ్గరి వాళ్ళను కూడా ముట్టుకోలేక అంటరానివాళ్ళలాగా... కడుక్కున్న చేతులని మళ్ళీ మళ్ళీ కడుక్కుంటు... ఏమవుతుందో అనుకుంటూ బిక్కు బిక్కు మంటూ జీవనం గడపడం.
బయట బోలెడు పనులున్న.. బయటకు పోతే ఈ కరోన మహమ్మారి తగులుకుంటుందోనని... ఉన్నవాడు తనకున్నదానితో సర్దుకుంటుంటే... లేనివాడు ఆకలికేకలతో అలమటిస్తున్నాడు.
ఏ ప్రభుత్వము ఏమి చేయాలో తోచక దిక్కు తోచని స్థితిలో ఉక్కిరిబిక్కిరి అవుతూఉంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక... ఎలా దాన్ని కంట్రోల్ చేయాలో అర్థం కాక, ఏమందు వాడాలో తికమకతో తల బద్దలు కొట్టుకుంటుంది.
మాస్కులు, సానిటైజర్, మరియు సహజ దూరం పాటిస్తూ ఇలా ఎన్నాళ్ళు బ్రతకాలి. అన్ని పనులు వదులుకొని ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చోవాలి. దీనికి ఏ వాక్సిన్ కనిపెడుతేనే పరిష్కారమ... మరి మళ్ళీ వేరే వైరస్ వస్తే మళ్ళీ వాక్సిన్ కనిపెట్టడమే దీనికి శాశ్వత పరిష్కారమ.
ఇలా ప్రతీసారి ఏదోఒక జబ్బుకొరకు వాక్సిన్ కనిపెడుతూనే ఉండాలా... వాటికొరకు కోట్లు కోట్లు ఖర్చుపెడుతూనే ఉండాలా... ఇంకా ఎన్నాళ్ళు ఈ తాత్కాలిక పరిష్కారాలు. మరి జంతువులకు ఎందుకు రావడం లేదు ఈ జబ్బులు. మనుష్యులకే ఎందుకు... రోగనిరోధక శక్తి ఉంటే ఎలాంటి జబ్బులు రావు, రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు... మరి దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎవరు చెప్పలేకపోయారు ఎందుకు. ఏ ఒక్క డాక్టర్ కూడా వీటి గురించి సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఎవరో కొందరు చెప్తున్న వాటి మీద ఏ ప్రభుత్వము దృష్టి పెట్టలేకపోతున్నది.
మరి
దీనికి పరిష్కారం ఎలా...
ఇమ్మ్యూనిటి పవర్ (రోగనిరోధక శక్తి) ఒక్కటే దీనికి పరిష్కారం. చాలా మంది రోగనిరోధక శక్తి పెరగాలి అనగానే వెంటనే అల్లం, పసుపు, శొంఠి ఇలా కషాయాలు తీసుకుంటున్నారు. ఇవి మంచివే కానీ ఏదైనా ప్రాబ్లెమ్ ఉన్నపుడే వీటిని ఎక్కువగా తీసుకోవాలి ఆ జబ్బు తగ్గేవరకు. మాములుగా ఉన్నపుడు తీసుకోవలసిన అవసరం అంతగా లేదు. ఎప్పుడో ఒకసారి తీసుకోవడంలో తప్పులేదు. కానీ రోజు తీసుకోవలసిన అవసరం లేదు. రోజు తీసుకుంటే రోగనిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది.
ప్రభుత్వం
బాధ్యత...
పండే
పంటలు, తినే తిండి, త్రాగే
నీరు, ఆహార పదార్దాలు అన్ని
కలుషితం కాకుండా చూసుకోవాలి. కెమికల్స్, ఎరువులు, ప్లాస్టిక్ వాడకం, స్టెరాయిడ్స్ వాడకాన్ని బ్యాండ్ చేయాలి. ఆర్గానిక్ ఫార్మింగ్, కెమికల్ ఫ్రీ, సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలి. ప్రభుత్వము పారిశ్రామక వ్యవస్థల గుప్పిట్లో ఉండకుండా రైతులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు కూడా
వస్తాయి. అలా చేస్తే ఏ
రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన అవసరం ఉండదు. అందరికి ఆహార నియమాల అవగాహన
పెంపొందించాలి.
కరోNA వైరస్ ను తట్టుకునే శక్తి కావాలంటే | Immunity I Manthena Satyanarayana raju | Health Mantra |
కరోనా వైరస్|CORONA VIRUS|dr ramachandra| prakruthi tv| health tips| immunity|breaking news|
కరోనాకి మందు ఈ కాషాయమే..| Coronavirus Cure Revealed | Coronavirus Treatment | Dr Sarala Khader
Prakruthivanam Prasad Precautions and Awareness on Present Situation | SumanTV Organic Foods
Precautionary Measures Of coronavirus through Natural Ways In Telugu | Ravi Verma | PMC
Written by...
Naveen Kumar Valloju
TechnoSpoorthi