Saturday, September 27, 2025

వరదలు మంపులు - ఇంకెన్నాళ్ళు, ఇప్పటికైనా మనం మేల్కొవాలి

 "వరదలు మంపులు"

ఇంకెన్నాళ్ళు, ఇప్పటికైనా మనం మేల్కొవాలి....

మనం చేసే పొరపాట్లు వళ్ళే ఈ వాతావరణ మార్పులు, ఉంటే అతి వృష్టి లేదా అనా వృష్టి. ఇదంతా మనకెందుకులే అనుకోవటం వల్లే, నేనొక్కడిని మారితే సరిపోతుందా అనుకోవడమే, ఎవరికి లేని బాధ నాకొక్కడికేనా అనుకోవడమే ఈ పొరపాటులన్నిటికి కారణం.

మరి బారీ వర్షాలు పడినప్పుడు మనమేం చేస్తాం, మనమేమన్నా చేయగలుగుతామా, అంత నీటిని ఆపగలుగుతామా, ఇదంతా ప్రకృతి విలాపమా! మన తప్పులు అసలు లేవా?

వరదలు, తట్టుకోలేని బారీ వర్షాలు, కుంభ వృష్టి లేదా ఇంకేదన్నా నదులు, చెరువులు కట్టలు తెగితేనో ఇంట్లోకి వర్షపు నీరు వచ్చి బాధపడాల్సి వెచ్చేది. ఒకప్పుడు కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసిన అంత సమస్య ఉండేది కాదు. కానీ ఇప్పుడు చిన్న వర్షం కురిసిన ఇంట్లో, వీధుల్లో నీరే...

కారణాలు చూద్దాం...

  1. బిల్డింగ్ కట్టడాలు పెరిగి పోయాయి, చెట్లు, అడవులు మాయమయ్యాయి, పూర్తిగా కాంక్రీట్ జంగిల్ గా మార్చేసుకుంటున్నాం. ఇల్లు కడితే చెట్లు ఉండవు, నీటిగా ఉండాలని ఇంటి ముందు నీళ్లు ఇంకకుండా సిమెంట్ తో పూర్తిగా కప్పివేస్తున్నాం. ఇంటి ముందు చెట్లు తీసివేసి చిన్న చిన్న మొక్కలు మాత్రమే పెడుతున్నాం. 

  2. నీళ్లు భూమి లోకి ఇంకక పోవడానికి ఇంకొక ముఖ్య కారణం ప్లాస్టిక్, ప్లాస్టిక్ సంచులను, కవర్లను బయట పడవేయడం వల్ల భూమిలో ఒక లేయర్ గా ఏర్పడి నీరు భూమి లోకి ఇంకడం లేదు. 

  3. కట్టడాలు పెరిగే కొద్ది కాలి ప్రదేశాలు మాయమవుతూ ఉంటాయి. మరి ఇల్లు, బిల్డింగ్ కట్టినపుడు మనం ఇంకుడు గుంతలు కడుతున్నామా! పూర్వం ఇండ్లు కట్టి అమ్మే బిల్డర్లు లేరు, ఇప్పుడు బిల్డర్లు తయారయ్యారు, లాభాలు చూసే వారే అయ్యారు కానీ ఒక ఇంకుడు గుంత కట్టించే బిల్డరే లేకుండా పోతుంది. బిల్డర్ల తప్పు కూడా ఇందులో ఉంది. మూడు, నాలుగు బాత్రూమ్ లు అయినా కట్టుకుంటాం కానీ ఇంకుడు గుంతకు మాత్రం ప్లేస్ లేదు అని సాకులు చెబుతాం. గవర్నమెంట్ రూల్స్ పెట్టినా కూడా మనం ఇండ్లలో ఇంకుడు గుంతలు కట్టుకోకుండా ఇండ్లమీద పడ్డ నీటిని పైపులు పెట్టిమరీ రోడ్ల మీదకు వదిలిపెడుతున్నాం. మరి మనకు బాధ్యత లేదా? 

  4. వీధుల్లో, రోడ్ల ప్రక్కన చెట్లు సరిగా లేకపోవడం ఒక కారణం. ముఖ్య మైన చెట్లు కనుమరుగవ్వడం. ఒకప్పుడు వేప చెట్లు చాలా ఉండేవి, ఇప్పుడు అవి కనుమరుగవుతున్నాయి. వేప, రావి, మర్రి, చింత చెట్టు ఇలా పెద్ద పెద్ద చెట్లు అక్కడక్కడ ఉండేవి. ఇప్పుడు అవి చూద్దాం అన్నా సరిగా కనపడటం లేదు. ఇక షాపుల ముందు చెట్లు పెంచడం లేదు, ఒకవేళ ఉంటే నా షాప్ బోర్డు కనపడట్లేదనో, లేదా షాపు కనపడట్లేదనో ఆ చెట్లను నరికివేస్తున్నారు. ఇంకొందరు కరెంట్ పోల్స్, వైర్లు, తీగలు ఉన్నాయి అని, అడ్డు ఉన్న కొమ్మలను నరకకుండా, పూర్తిగా చెట్లనే నరికివేస్తున్నారు. 

  5. అతి ముఖ్యమైనది, చెరువులు, కుంటలు మాయమవ్వడం. పూర్వం అవసరాల కోసం, ఇబ్బంది లేకుండా, ప్రమాదాలు వచ్చిన నీరు చెరువులు, కుంటల లోకి నీటిని మళ్లించేవారు. ఊర్లో చెరువులు లేకుంటే జనాలు అందరు కలిసి చెరువు తవ్వుకునేవారు. అప్పటి రాజులు, మరియు నిజాం కాలంలో కూడా చెరువులను తవ్వించారు. అప్పటి భాగ్యనగరం (హైద్రాబాద్) లో రెండు వేలకు పైన చెరువులు, కుంటలు ఉంటే ఇప్పుడు కట్టడాల పేరుతో రెండు వందలు చెరువులు కూడా లేకుండా చేశారు. ఇదంతా కొందరు అవినీతి రాజకీయ నాయకులు, డబ్బున్న బడాబాబులు, ప్రభుత్వ అధికారులు చేసిన పనే, పూర్తిగా ప్రభుత్వాల విఫలం. ప్రతీ సంవత్సరం చెరువుల పూడిక తీయక పోవడం కూడా ప్రభుత్వ నిర్లక్ష్యమే. ఒకప్పుడు ఒక చెరువు నిండితే కాలువలు, నాళాల ద్వారా ఇంకొక చెరువుకు గొలుసు కట్టు విధానంతో అనుసంధానం ఉండేది, ఇప్పుడు ఆ కాలువలు, నాళాలను కూడా కబ్జాలు చేసేసారు. అప్పుడు ముందు చూపుతో చెరువులను తవ్విస్తే, ఇప్పుడు స్వంత ప్రయోజనాల కొరకు కబ్జాలు చేసి చెరువులను, కుంటలను మాయం చేశారు. జనాలు కూడా ప్రశ్నించక పోవడం ఇందుకు కారణమే, కలిసి కట్టుగా పోరాడకుండా మాకెందుకులే అనుకోవడమే. 

  6. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడం. డ్రైనేజీ ఉన్న ప్రదేశాలలో నాణ్యత లోపాల వల్ల సరిగా లేకపోవడం. ఇంకా కొన్ని చోట్ల ఎప్పుడో ఏర్పాటు చేసిన డ్రైనేజీ వ్యవస్థే ఉండటం. వర్షపు నీరు వచ్చినపుడు ఆ డ్రైనేజీ వ్యవస్థే సరిపోకపోవడం. రోడ్లు వేసేటప్పుడు నీరు పోయే మార్గం చూపకపోవడం, అంటే రోడ్లు వేసేటప్పుడు ఇంకుడు గుంతల ఏర్పాటు లేకపోవడం, అది రవాణా వ్యవస్థ కు, నీటి పారుదల సంస్థకు సరైన సమన్వయం లేకపోవడం కూడా ముఖ్య కారణమే. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. కొందరు జనాలు డ్రైనేజీ లలో ప్లాస్టిక్ రాపర్లు, షాంపూ ప్యాకెట్లు, కండోమ్ ప్యాకెట్లు మొదలగున్నవి వేయడం కూడా నీరు సరిగా పోకపోవడానికి కారణం అవుతున్నాయి. 

మరి దీనికి పరిష్కారం ఏమిటి? దీనిలో మన బాధ్యత ఏంటి?

  1. ఇండ్ల కట్టడాలు, జనాభా పెరుగుతున్నపుడు దానికి సరిపడా చెట్లు ఉండేటట్లు చూసుకోవాలి. ప్రతీ ఇంటి ముందు పూర్తిగా సిమెంట్ తో కప్పి వేయకుండా, కొన్ని మొక్కలు మరియు కనీసం రెండు పెద్ద చెట్లు ఉండేటట్లు చూసుకోవాలి. పెద్ద చెట్లు అనగానే కొందరు వెంటనే పెద్ద చెట్లు ఇంటి ముందు ఎలా పెంచుతాము, మా గోడలు పగులుతాయి, వేర్లు లోపటికి వస్తాయి, కార్లు, వెహికల్స్ ఎక్కడ పెట్టుకోవాలి, రోడ్డు సరిపోవద్దా అనే వారు ఉంటారు. పెద్ద చెట్లు అంటే వేప, మర్రి, రావి, చింత ఇలా కాకుండా, కొద్ది మొత్తం లో పెరిగే మామిడి, ఉసిరి, కానుగ మొదలగున్న వాటిని పెంచుకోవచ్చు. ఇలా వెహికల్స్ అంటారా... వెహికల్స్ లేకుండా బ్రతకచ్చు కానీ చెట్లు లేకుండా ఎలా బ్రతుకుతావు, చెట్లే లేకపోతే గాలి (ప్రాణ వాయువు) ఎలా వస్తుంది, అది కూడా గమనించలేని స్థితిలో మనం ఉన్నాము. ఆ రెండు పెద్ద చెట్లే ఉంటే నీకు, నీ కార్లకు అంటే వెహికల్స్ కు కూడా నీడను ఇస్తుంది, వాతావరణ ప్రమాదాలనుండి కాపాడుతుంది. ఇంకా కొందరు ఉంటారు చెట్ల వల్ల ఆకులు రాలుతున్నాయి, మీ చెట్లు వల్ల చెత్త మా ఇంటి ముందు పడుతుంది అని. చెట్లు ఇంటి ముందు ఉంటే ఆకులు కాకుంటే బంగారం రాలుతుందా! రాలుతే ఊకుతే సరిపోతుంది, రోజు ఇంటి ముందు ఊకవా! దానికి అంత ఆర్భాటం ఎందుకు. ఇంకొందరు ఉంటారు చెట్లు ఉంటే పురుగు పూచి, పాములు వస్తాయి అని... వాళ్ళ ఇంటి ముందుకు కొమ్మలు వేస్తే విరిచి పడేస్తూ ఉంటారు, మన ఇంటి ముందుకే కొమ్మలను పడేస్తూ ఉంటారు. చెట్లు ఉంటే అన్నీ వస్తాయి, నీవు ఎలా బ్రతుకుతున్నావో అవి కూడా అలానే బ్రతుకుతూ ఉంటాయి, నీవు జాగ్రత్తగా ఉండాలి అంతే కానీ భయంతో చెట్లనే నరికి వేస్తే ఎలా? ఆ చెట్ల వల్ల గాలి వస్తుంది అని గాలి పీల్చకుండా ముక్కు మూసుకుంటావా, అలా అని గాలి లేకుండా బ్రతకగలవా? మనం మారాలి, మన ఆలోచన మారాలి. ప్రకృతి తో బ్రతకడం నేర్చుకోవాలి. అంతస్తుల మీద అంతస్తులు అంటే ఎన్ని ప్లోర్లు కట్టామా అనే కాకుండా దానికి సరిపడా చెట్లను కూడా పెంచుతున్నామా లేదా అని కూడా చూసుకోవాలి.

  2. వీలున్న చోట ప్లాస్టిక్ సంచులకు బదులుగా బట్ట సంచులను లేదా జ్యూట్ బ్యాగులను వాడటం. ప్లాస్టిక్ కవర్లను రోడ్లమీద, కాలీ ప్రదేశాలలో పడవేయకుండా చెత్త బండీ లో, చెత్త బుట్టలలో పడవేయడం, మున్సిపల్ వాళ్లకు ఇవ్వాలి. ఇంట్లో ఉన్న చెత్తనే కాదు మీ (మన) ఇంటి ముందు ఉన్న చెత్తను కూడా శుభ్రం చేసుకోవడం మన బాధ్యత నే. చాలామంది ఇంటి ముందు ఉన్న చెత్తను, ప్లాస్టిక్ కవర్లను తీసివేయడం లేదు. మన కాలనీ మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. బయటకు వెళ్ళినప్పుడల్లా చేతి సంచులను ఇంటి నుండే తీసుకొని వెళ్ళడం, వాటర్ బాటిల్ లను తీసుకుని వెళ్ళడం వల్ల, బయట ప్లాస్టిక్ ను నివారించవచ్చు. ఒకేసారి మొత్తం ప్లాస్టిక్ ను నివారించక లేక పోయినా ఒక్కొక్కటిగా ప్లాస్టిక్ నివారణకు, వాడకాన్ని తగ్గించుకుంటూ రావాలి. ప్లాస్టిక్ కవర్లను వాడేసిన ప్లాస్టిక్ బాటిల్ లో పెట్టీ రీసైకిల్ కు వేస్తే ప్లాస్టిక్ కవర్లు బయట భూమి మీద పడకుండా ఉంటుంది.

  3. ప్రతీ ఇంట్లో, అపార్టుమెంటులో, బిల్డింగ్ లలో ఇంకుడు గుంత తప్పనిసరిగా ఉండాలి. ఇంట్లో ఉండే నీరు బయటకు, రోడ్ల మీదకు వదలకుండా ఉండాలి. కుదిరితే ఇంటి ముందు లేదా ఎక్కడైతే నీరు నిలబడుతూ ఉంటుందో అక్కడ ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలి. ప్రతీ కాలనీలో ఈ చర్చలు జరగాలి, ఐకమత్యం తో పనులు చేసుకోగలగాలి. ఇది మన బాధ్యత, మనందరి బాధ్యత.

  4. ప్రతీ వీధిలో, ప్రతీ రోడ్ల ప్రక్కన చెట్లు ఉండేటట్లు చూసుకోవాలి, కాలనీ రోడ్లలో కాలనీ వాసులు మరియు అసోసియేషన్ బాధ్యత వహించాలి. బయట ప్రదేశాలలో ప్రభుత్వం బాధ్యత వహించాలి. బయట ఇష్టం ఉన్నట్లు చెట్లు నరకకుండా ప్రజలు, ప్రభుత్వం కలిసి చూసుకోవాలి.

  5. చెరువులు, కుంటలను కాపాడుకోవాలి, నాళాలు కబ్జా కాకుండా చూసుకోవాలి. దీనికి ప్రజలు, ప్రభుత్వం కలిసి పనిచేయాలి.

  6. డ్రైనేజీ వ్యవస్థ ను మెరుగుపరచాలి. నాణ్యత లోపం లేకుండా ప్రభుత్వం బాధ్యత వహించాలి. జనాలు కూడా డ్రైనేజీ లలో చెత్త వేయకుండా చూసుకోవాలి.

పై వాటిలో ఏ బాధ్యత లేకున్నా వారికి ప్రశ్నించే హక్కు లేదు. మన ప్రదేశం సరిగా ఉండాలంటే మనం ముందుగా అన్నీ సక్రమంగా చేస్తున్నామా చూసుకోవాలి.


Sunday, April 13, 2025

చికెన్, గుడ్లు లల్లో నిజంగా ప్రోటీన్ ఉందా !

 చికెన్, గుడ్లు లల్లో నిజంగా ప్రోటీన్ ఉందా !


కొన్ని నిజాలు తెలుసుకుందాం...


మీరు ఎంత హై టెంపరేచర్ మీద వండిన అందులోని క్రిమి చస్తుందేమో కానీ రోగం చావదు. ఒకవేళ కోడికి birdflu కానీ ఇంకా ఏదైనా వ్యాధి వచ్చినపుడు ఆ కోడికి వ్యాధి సోకుతుంది, అది మీరు వండి తిన్నా మనకు ప్రాబ్లెమే, కాబట్టి వ్యాధి ఉన్నపుడు తినకపోవడమే మంచిది.

ఇంకొక విషయం ఎండాకాలంలో కోళ్లకు ఎక్కువగా వ్యాధులు సోకుతాయి, గుడ్లు కూడా త్వరగా పాడైపోతాయి. కాబట్టి ఎండాకాలంలో చికెన్ మరియు గుడ్లు తినకపోవడమే మంచిది. ఒకప్పుడు ఎండాకాలంలో చికెన్, గుడ్ల రేటు తక్కువ చేసేవారు, అవి త్వరగా అమ్ముడు పోవాలని, కానీ ఇప్పుడు అవి ప్రోటీన్ అని అబద్దం చెప్పడంతో జనాలు ఎగబడి తింటున్నారు.

మరి చికెన్, గుడ్ల లో నిజంగా ప్రోటీన్ ఉందా!


ఉంది. కానీ పప్పు దినుసులతో పోలిస్తే చికెన్, గుడ్ల లో ప్రోటీన్ తక్కువే. చికెన్ 100gms, బాదం పప్పు 100gms తీసుకుందాం. చికెన్ వండటం వల్ల కొన్ని పోషకాలు, ప్రోటీన్లు పోతాయి. ఆ వండినది తిన్న తర్వాత అది అరగటానికి, శక్తిగా మారటానికి మన నుండి ఎక్కువ శక్తి ఖర్చు అవుతుంది. అదే బాదం పప్పు వండకుండా డైరెక్ట్ గా నానబెట్టుకొని తింటే రెట్టింపు శక్తి వస్తుంది. అవి అరగడానికి చాలా తక్కువ శక్తి కావాలి. అంటే దినుసులు 90% ప్రోటీన్ ఇస్తే, ఇక్కడ చికెన్, గుడ్లు 40% శక్తి కూడా సరిగా ఇవ్వడం లేదు. మరి ఎందులో నుండి ఎక్కువ ప్రోటీన్ పొందుతున్నాం! 


ఇక గుడ్లు అయితే పెసర పప్పుతో కూడా పోటీపడలేదు, మరి మన వద్ద శనగ పప్పు, కంది పప్పు, ఇంకా చెప్పాలంటే కాజు, బాదం, పిస్తా ఇలా చాలానే ఉన్నాయి, కానీ వీటి గురించి ఎవరూ చెప్పరు. ఎందుకంటే అవి తింటే డాక్టర్ల దగ్గరికి ఎవరూ వెళ్ళరు. 


మరి డాక్టర్లు మరియు ఎక్స్పర్ట్స్ అని చెప్పే వాళ్ళు ఎందుకు తినుమని చెబుతున్నారు. వాళ్ళు చాలావరకు స్వయంగా చెప్పడం లేదు, కోళ్ళు, గుడ్లు బిజినెస్ చేసేవాళ్ళు వీళ్ళతో చెప్పిస్తున్నారు, వీళ్ళు గత్యంతరం లేకనో, వాటి మీద అవగాహన లేకనో తినుమని చెబుతున్నారు. చికెన్, గుడ్లు తింటే ముఖ్యంగా ఎవరు బాగు పడతారు, అమ్మే వాడు, బిజినెస్ పర్సన్. మరి పప్పు దినుసులు, డ్రై ఫ్రూట్స్ పండించే వాడు ఎవరు రైతు, కానీ రైతు ఎప్పుడూ రాజు కాలేడు. ఇక మీరే అర్థం చేసుకోండి.

మరి చికెన్, గుడ్లు మంచిదేనా?


ఒకప్పుడు అంటే 90 శతకం వరకు కోళ్ళు ఇంట్లోనే పెంచుకునే వారు. వాటి నుండి వచ్చిన గుడ్లనే తినేవారు. అప్పట్లో కూరగాయలు చాలా తక్కువనే తినేవారు. చికెన్, గుడ్లు లేదా మాంసం వారానికి ఒకరోజు మాత్రమే తినేవారు. అప్పట్లో అంత మోసాలు, ఆశలు లేవు. అన్ని డబ్బులు కూడా లేవు. కానీ ఇప్పుడు ఎవరూ కోళ్ళని పెంచుకోవడం లేదు. అందరూ బయటనే తింటున్నారు. అది కూడా ఫారం కోడినే ఎక్కువగా తింటున్నారు. ఫారం కోడి కేజీ లేదా కేజీన్నర ఉండాల్సిన కోడి ఇప్పుడున్న కోళ్ళు 2 లేదా 3 కేజీల వరకు ఎలా ఉంటుంది, ఇది ఆలోచించాలి. ఇప్పుడు మోసాలు ఎక్కువై పోయాయి. స్వార్ధం ఎక్కువై పోయింది. డబ్బుల కొరకు కోళ్ళకు స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వేసి వాటి బరువు పెంచి వాటి ద్వారా డబ్బును సంపాదిస్తున్నారు. ఆ స్టెరాయిడ్స్ వల్ల అవి తిన్న మనకు క్యాన్సర్ వస్తుందని మనకు తెలుసా! స్టెరాయిడ్స్ వాడిన గుడ్లు తినడం వల్ల కూడా క్యాన్సర్ బారిన పడుతున్నారు. అసలు చికెన్ 65 అని పేరు ఎందుకు వచ్చిందో తెలుసా, ఒక కోడి 65 రోజులు పెరిగి పుష్టిగా తయారు అయిన తరువాత ఆ కోడిని వండుకొని తినేవారు. కానీ ఇప్పుడు 40 రోజులకే ఫారం కోడి 2, 3 కేజీలకు పెరిగి పోతుంది. మరి అలా పెరిగింది అంటే ఏం జరుగుతుందో ఆలోచించాలి.

బాదం పప్పు రేటు ఎక్కువా లేదా మాంసం రేటు ఎక్కువా?

బాదం పప్పు రేటు మార్కెట్ లో సుమారుగా కేజీ ₹800 నుండి ₹1200 ఉంది. బాదం పప్పు ఒక 1/2 కేజీ తెచ్చుకొని రోజుకు 2, 3 బాదం పప్పులు నానబెట్టుకొని తిన్నా నెల మొత్తం ఇంటిల్లిపాది తినవచ్చు. హైజెనెక్ గా బ్రతకొచ్చు. చాలా శక్తిని, ఆరోగ్యాన్ని ఇస్తుంది.


అదే మేక మాంసం కేజీ సుమారుగా ₹800 ఉంది. అది ఒక పూటకో లేదా ఒక రోజులో వండుకొని తింటున్నాం. మరి ఇది బలాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుందా అంటే గ్యారెంటీ ఇవ్వలేం. మరి దీనికి నెలలో ఎంత ఖర్చు పెడుతున్నాము మనమే ఆలోచించుకోవాలి.

నాన్ వెజ్ ఎందుకు ఎక్కువ తింటున్నారు?

నాన్ వెజ్ తినటం ప్రోటీన్ కోసమో లేదో నాకు తెలియదు కానీ చాలా మంది రుచికి మరిగి తింటూ ఉన్నారు. ఒక్కసారి మాంసం రుచి మరిగాడా ఇక మానడం కష్టమే. ఎందుకంటే మంచి మసాలా దట్టించి చేయడం వల్ల రుచిగా ఉంటుంది. ప్రోటీన్ పేరుతో మేము తినము అని చెప్పే కొందరు బ్రాహ్మణులు, వైశ్యులు కూడా మేమెందుకు తినొద్దు అని తింటున్నారు, ఇక కరోనా తరువాత మరీ ఎక్కువ అయ్యింది. చికెన్ తినండి కరోనాని ఎదుర్కోండి, చికెన్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది అని అబద్దం చెప్పి మరీ బిజినెస్ నడిపారు. పాపం అది నమ్మి అమాయక జనాలు క్యూలో నిలబడి మరీ కొనుక్కొని ఎగబడి తిన్నారు.


కొందరు బిజినెస్ వాళ్ళు, రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కొరకు డాక్టర్ల చేత ప్రోటీన్ పేరుతో తినమని చెప్పే వరకు ఇప్పటివరకు తినని వారు కూడా ఎగబడి మరీ తింటున్నారు. అన్యం పుణ్యం ఎరుగని వాళ్ల పిల్లలకు కూడా ప్రోటీన్ పేరు చెప్పి మరీ బలవంతంగా తినిపిస్తున్నారు. ఇక జిమ్ లకు వెళ్ళే వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇష్టమొచ్చినట్లు గుడ్లు తినిపిస్తున్నారు.

కొన్నేళ్ల క్రితం వరకు పాఠ్య పుస్తకాలలో పౌష్టికాహారంలో ఆకుకూరలు, పప్పు దినుసుల గురించి ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పౌష్టికాహారం అంటే పాలు, గుడ్లు, మాంసం అని మాత్రమే మార్చి ఇప్పటి తరానికి పౌష్టికాహార అర్థాన్నే మార్చేశారు. ఇక ఇప్పటి తరం ఏమి నేర్చుకుంటుంది. ప్రతీ విద్యార్థికి ఒకటి పోయి, రెండు గుడ్లు పెడుతున్నారు. మరి ఆరోగ్యం ఎటు పోతుంది. ఒకప్పుడు డబ్బులున్నపుడో, ఆదివారమో, పండుగకో లేక చుట్టం వచ్చినపుడో కోడి యో, మాంసము తెచ్చుకొని తినేవారు. కానీ ఇప్పుడు డబ్బులు ఎక్కువై పోయి వారానికి 4 రోజులు మాంసం తిని, బోర్ కొడితే కూరగాయలు తెచ్చుకొని తింటున్నారు. కొందరి కైతే ముక్క లేనిదే ముద్ద కూడా దిగదు అన్న చందంగా మారిపోయింది. తిని తిని రోగాలు పెంచుకుంటున్నారు. 

చికెన్, గుడ్లు, మాంసం తినాలా వద్దా!

చికెన్, మాంసం తిన్నరోజు మజ్జుగా, ఆయాసంగా ఉంటాడు, మెదడు మొద్దు మారుతుంది, తెల్లారి మోషన్ పోవటానికి కష్టపడతారు. ఎందుకంటే నాన్ వెజ్ లో జీరో ఫైబర్. ఆకులు తిన్న మేక కొండలు ఎక్కుతుంది, మేకను తిన్న మనిషి ఇంటి మెట్లు ఎక్కలేకపోతున్నాడు. ఈ రోజుల్లో 80% నాన్ వెజ్ తినేవాళ్లే, ఆడవాళ్ళు, చిన్న పిల్లలు కూడా కేజీలకు కేజీలు తింటున్నారు. మరి అందరూ బలంగా ఉండాలి కదా, కానీ రోగాలు ఎందుకు పెరుగుతున్నాయి, నాన్ వెజ్ తినేవాళ్ళు మన దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంది, విచిత్రం 
ఏమిటంటే ప్రోటీన్ల లోపం ఇండియాలోనే అత్యధికం. మరి ఇంత నాన్ వెజ్ తింటున్నపుడు ప్రోటీన్ ఎక్కువ ఉండాలి కానీ, లోపం ఎందుకు ఉంది.


ఆడవాళ్ళకు PCOD, రక్తహీనత మరెన్నో రోగాలతో ఎందుకు బాధపడుతున్నారు.
హాస్పిటల్స్ కోకొల్లలుగా ఎందుకు పుట్టుకొస్తున్నాయి. ఎందుకంటే ఈ నాన్ వెజ్ తినడం కూడా ఒక కారణమే. తక్కువగా, అకేషనల్ గా తింటే తక్కువ జబ్బులతో బయట పడతాం. పూర్తిగా మానేయడం ఉత్తమం. కానీ ఎవరి ఇష్టం వారిది. ఎవరెన్ని చెప్పినా మేమైతే తింటాం, డాక్టర్లే చెప్పంగా లేంది ఎవరెన్ని చెప్తే మాకేంటి అనుకునే వాళ్ళు కొందరుంటారు. మేం ఎప్పటినుంచో తింటున్నాం మేం బాగానే ఉన్నాం, మాకేం కాదులే అనుకునే వాళ్ళు కొందరు. ఎవరెన్ని చెప్పినా ఎంజాయ్ చేయాలి అనుకుని తినేవారు కొందరు. ఇంకా కొందరు వితండ వాదం చేసేవారు కొందరు. రోగం చెప్పి వస్తుందా. ఈ రోజుల్లో జ్ఞానానీకంటే పత్రానికే విలువ ఇస్తున్నాం. ఇక తినాలా వద్దా అనేది ఎవరికి వారే నిర్ణయించుకోవాలి. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే.

ఇదంతా చదువుతున్నపుడు చికెన్, గుడ్లు, మాంసం తినేవారికి ఇబ్బందిగా, కోపంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ నిజం మారదు కదా. నిజం కొద్దిగా చేదుగానే ఉంటుంది. నిజం తెలుసుకో మిత్రమా.

నవీన్ కుమార్ వల్లోజు