మన బాధ్యత
మనం, మన రాష్ట్రం, మన దేశం శుభిక్షంగా ఉండాలంటే? ఇవి పాటిస్తున్నమా చూసుకోండి.
- ప్రతీ ఒక్కరి ఇంటి ముందు చెట్లు ఉండేటట్లు చూసుకోండి. ఇంటి ముందు శుభ్రంగా
ఉండాలనో, వాహనం నిలుపడానికో మొత్తం సిమెంట్ ఫ్లోరింగ్ చేయించవద్దు. ఒకటి
లేదా రెండు పెద్ద చెట్లు పెట్టడానికి ప్రయత్నించండి.
- ఇంట్లో ఇండోర్ మొక్కలు పెట్టడానికి, మిద్దతోటలను పెంచటానికి ప్రయత్నించండి.
- ప్రతీ ఒక్కరి ఇంట్లో ఇంకుడు గుంతను తప్పనిసరిగా నిర్మించేటట్టు/ఉండేటట్లు చూసుకోండి. వర్షపు నీటిని ఒడిసి పట్టుకోండి.
- ఇంటి ముందు వాకిలి ఊడ్చేటప్పుడు ఇంటి ముందు ఉన్న చెత్తను పక్క ఇంటి వాళ్ళ
వైపు ఊడ్చి నెట్టవద్దు. ఆ చెత్తను మీరే ఎత్తివేయండి, అది మీ బాధ్యతగా
భావించండి. మన వీధి మనమే శుభ్రంగా ఉంచుకోవాలి. అదేదో ప్రభుత్వానిది మాత్రమే
బాధ్యత అని అనుకోకూడదు.
- చెత్తను చెత్త బుట్టలోనే పడవేయాలి. ఎక్కడ పడితే అక్కడ, అంటే వీధిలోనో, ఇంటి పక్కన లేదా బయట ఉన్న ఖాళీ ప్రదేశాలలోనో పడవేయవద్దు.
- చెత్తను చెత్త బుట్టలో వేసేటప్పుడు అందులో (తడి, పొడి చెత్త వేరుగా)
ప్లాస్టిక్, ఇనుప, సీసా మొదలగు వ్యర్ధాలను అంటే ప్లాస్టిక్ డబ్బాలు, శాంపో
బాటిల్స్ ఇలా మొదలగున్నవి చెత్త డబ్బాలో పడవేయకుండా మీరే వాటిని శ్రమ
అనుకోకుండా వేరు చేసి సంచులలో భద్రపరిచి రీసైక్లింగ్ (ప్లాస్టిక్/ఇనుప
సామాన్లు కొనేవారికి) అమ్మేయండి. లేదా చెత్త తీసుకొని వెళ్ళేవాళ్లకు అయినా
ఇవ్వండి. ఎందుకంటే అందరూ వేసే చెత్తలో అలాంటి వాటిని మొత్తం వేరు చేయటం
వాళ్లకు కూడా సాధ్యం కాదు.
- బయటకు లేదా విహార
యాత్రలకు వెళ్ళినపుడు ఎక్కడ పడితే అక్కడ చెత్తను (ముఖ్యంగా ప్లాస్టిక్
వ్యర్ధాలను) పడవేయకండి. ప్లాస్టిక్ కవర్లను బయటపడవేసినప్పుడు అవి భూమిలో
కరగక భూమి పై పొరలల్లో నే ఉండిపోయి వర్షపు నీరు భూమిలో ఇంకకుండా
చేస్తున్నాయి.
- ఇంటి వాకిలి ఊడ్చిన తర్వాత పైపులతో
వాకిలి కడగవద్దు. బకెట్, జగ్గు వాడి కొద్ది నీటిని మాత్రమే వాడాలి, రోడ్డు
మొత్తం కడగవద్దు, ఆ రోడ్డు పై ఆ నీరు ఎటు వెళ్లలేక వీధి రోడ్లు మొత్తం
కరాబు అవుతున్నాయి.
- వాహనాలు, ఇండ్లు కడిగేటప్పుడు వాటర్ పైపులతో కడగకండి, నీటిని వృధా చేయకండి, పొదుపుగా బకెట్, జగ్గులతో నీటిని వాడుకోండి.
- విహార యాత్రలకు వెళ్ళినపుడు అక్కడ పుణ్యక్షేత్రాలలో ఉండే నదులల్లో
ప్లాస్టిక్ వ్యర్ధాలను పడవేయవద్దు. అందులో వేసే ప్లాస్టిక్ కవర్లు,
బాటిల్స్ నీటి కాలుష్యంగా మారిపోతున్నాయి. వాటి వల్ల ఎన్నో జీవరాసులు కూడా
చనిపోతున్నాయి. కాలువలు, చెరువులు, నదులు మన దేశ వనరులు, వాటిని
కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే.
- బయటకు ఎక్కడికి
వెళ్లినా ఇంటి నుండి నీళ్ల బాటిల్ ని తీసుకొని వెళ్ళండి. బయట అమ్మే
ప్లాస్టిక్ బాటిల్ వినియోగాన్ని తగ్గించవచ్చు. అటు ఆరోగ్యాన్ని ఇటు
పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు.
- వంటింట్లో ఉండే సింక్ లల్లో అంట్లను పడకుండా జాలిని వాడుకొని డ్రైనేజి జామ్ కాకుండా చూసుకోండి.
- డ్రైనేజి లల్లో చెత్తను, వాడిపడేసే డైపెర్ లను, ప్లాస్టిక్ కవర్లను,
కండోమ్ లను పడవయేవద్దు. వీటి వల్ల వీధిలో డ్రైనేజీ నీళ్లు
పొంగిపొర్లుతున్నాయి.
- సామాన్లు, కూరగాయలు, పండ్లు
మొదలగు వాటిని కొనటానికి బయటకు వెళ్ళినపుడు ఇంటినుండే సరిపడు చేతి బట్ట
లేదా జనపనార సంచులను వాడేటట్టు చూసుకోండి. బయట వ్యాపారుల దగ్గర ప్లాస్టిక్
సంచులను అడగవద్దు. కొందరైతే చిరు వ్యాపారుల దగ్గర ప్లాస్టిక్ సంచులు
ఇవ్వకపోతే వాళ్ళ దగ్గర కొనటమే మానేస్తున్నారు. అలా వాళ్ల వ్యాపారాన్ని
దెబ్బతీయకండి. మీరే బ్యాగులను తీసుకవెళ్లండి.
- బైక్ లేదా కారులో వెళ్ళేవాళ్ళు ఎల్లప్పుడూ చేతి సంచులను స్పేర్ లో
ఉంచుకోండి. అవసరం వచ్చినపుడు బయట ప్లాస్టిక్ సంచులను అడగకుండా ఉండవచ్చు.
- వీలైనంత వరకు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించండి, కుదిరితే మానేయండి.
మానేయడం కుదరదు అని అనుకోకండి, ప్రయత్నిస్తే సాధ్యం అవ్వదు అని ఏది లేదు.
మీ వంతుగా మీరు మానేయండి.
- పాన్, గుట్కా లు తిని ఎక్కడపడితే అక్కడ అంటే రోడ్లమీద, మేడ మెట్ల మీద ఉమ్మివేయకండి. కుదిరితే పాన్, గుట్కాలు తినటం మానేయండి.
- పాలు పాల ప్యాకెట్లను వాడేవాళ్ళు, పాల ప్యాకెట్ కవర్ల చివరను పూర్తిగా కట్
చేయకండి. అలా కట్ చేసి పడవేసిన ప్లాస్టిక్ ముక్క చెత్తలో కనపడదు. ఆ ముక్క
కనపడక పశువులు చెత్తను తింటే ఆ ప్లాస్టిక్ కవర్ వాటి కడుపులోకి వెళ్లి అవి
ఇబ్బంది పడతాయి. కుదిరితే పాల ప్యాకెట్లు మానేసి డైరెక్ట్ గా పాలను కొనండి
లేదా వాళ్లనే అలా పోయమనండి, అలా ఆరోగ్యాన్ని, పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు
అవుతారు.
- అవసరమైతేనే వెహికల్ బయటకు తీయండి, ఇంధనాన్ని పొదుపు చేయండి.
- సామాన్లు కొనేటప్పుడు ఏమికొనాలో నిర్ణహించుకొని మాత్రమే కొనండి, అనవసరమౌనవి కొనకండి. డబ్బు వృధా కాకుండా చూసుకోండి
- కరెంట్, నీటి మరియు ఇంటి పన్ను సకాలంలో ఉండేటట్టు చూసుకోండి.
- ఎవరు ఏమి చెప్పినా అది ఎందుకు చెప్పారు అని ఆలోచించండి, గుడ్డిగా ఏది నమ్మకండి.
- ఏమన్నా తప్పు కానీ ప్రమాదం కానీ జరుగుతే నాకెందుకులే అని వదిలేయకండి, మీ
వంతుగా చేయగలిగింది చేయండి, అది మన ధర్మం అని గుర్తించుకోండి.
- సమాజ సేవలో ప్రతీ ఒక్కరూ భాగంకండి. దేశం మనకేమిచ్చింది అని కాకుండా మనం దేశం గురించి ఏం చేస్తున్నాం అని ఆలోచించండి.
- ఏదైనా తప్పు జరుగుతే ప్రశ్నించటం నేర్చుకోండి.
- ప్రతీ ఒక్కరూ కలిసి మెలసి ఉండేటట్టు చూసుకోండి.
No comments:
Post a Comment