Wednesday, December 11, 2024

త్వరగా మేలుకో మిత్రమా...

 త్వరగా మేలుకో మిత్రమా...


జాగరూకతో ఉండు... ప్రళయం విజృబిస్తుంది... తెలియకుండానే మింగేస్తుంది. ఇకనైనా మేలుకో మిత్రమా, సత్యాన్ని గ్రహించు.

పిట్టల్లా రాలి పోతున్న ప్రాణాలు, వయసు మీదపడక ముందే చెప్పలేని *రోగాలు*, *చిన్న వయసులోనే ఆకస్మిక గుండెపోట్లు*, టెక్నాలజీ ఇంత ఉన్నా జబ్బుని నయం చేయలేని మందులు, ఆసుపత్రులు... ఎందుకు ఇంత విపరీత ధోరణి, ఏమిటీ కారణం, ఒక్కసారి ఆలోచించండి.

*కలుషిత వాతావరణమా!*
*కలుషిత నీరా!*
*విషతుల్యమైన ఆహారమా!*
*దారి తప్పిన ఆలోచనలా!*

అవుననే చెప్పాలి, కానీ ఇవ్వన్నీ కొన్ని సంవత్సరాలుగా (అంటే ముఖ్యంగా 40 నుండి 60 సంవత్సరాల నుండి) కొద్ధి కొద్దిగా మార్పులు చెందుతూ (వికృత రూపం దాల్చుతూ) ఉన్నాయి. అప్పుడూ జబ్బులు, గుండెపోట్లూ ఉన్నాయి. కానీ కరోనా వచ్చిన తర్వాత, కరోనా వ్యాక్సిన్లు తీసుకున్నపటి నుండి ఇమ్మ్యూనిటి పెరుగుతుంది అన్నారు, కానీ ఎందుకు ఒక్కసారి గుండెపోటుకే పోయేంత బలహీనమైన రోగ నిరోధక శక్తి ఆవహించింది. ఎందుకు ఇన్ని ప్రాణాలు కోల్పోతున్నాము, ఒక్కసారి ఆలోచించండి, పరిష్కారం ఏంటి?

జరిగిపోయిన దాన్ని తిరిగి తీసుకొని రాలేము, ఇప్పుడైనా మారుదాము.

1. ఎవరు ఏమి చెప్పినా దాన్ని *తెలుసుకునే* ప్రయత్నం చేయండి. అది డాక్టరైనా, శాస్త్రవేత్త అయినా, ప్రభుత్వ అధికారి అయినా గుడ్డిగా నమ్మకండి. నాకెందుకులే అనుకోకుండా *ప్రశ్నించే* (ఎందుకు, ఏమిటి, ఎలా) ధోరణి అలవాటు చేసుకోండి. సబ్జెక్ట్ మనది కాకపోయినా అవసరం మేరకు *శోధించి* తెలుసుకోండి. ప్రతీ దానికి నాకు తెలుసు అనుకొని వాదించకుండా (argument), చర్చ (discussion) రూపంలో తెలుసుకునే ప్రయత్నం చేయండి.
2. సాధ్యమైనంత వరకు *బయట తినడం* ఆపేయండి.
3. బ్రాండ్ అనే ఆలోచన లేకుండా, వీలైనంత వరకు *ప్రకృతి సిద్ధమైన ఆహారం* తీసుకోండి.
4. తక్కువ డబ్బులకు దొరుకుతున్నాయి గా అని *కల్తీ ఆహార* వస్తువులను కొనకండి. *ఆర్గానిక్ షాపుల్లోనో*, లేదా నేరుగా *ప్రకృతి సేద్య రైతు* నుండి మాత్రమే ఆహారపు వస్తువులను కొనండి. మార్ట్ లల్లో తక్కువగా దొరుకుతాయి కదా అని ఎగపడకండి. డీ మార్ట్, రత్నదీప్ ఏ మార్ట్ అయినా కొనటం మానేయండి.
5. చికెన్, గుడ్లలో *ప్రోటీన్* ఉంది అని తెగ తినేయకండి, వీలైనంత వరకు మాంసాహరాన్ని మానేయండి. అవసరమైన ప్రోటీన్ సహజమైన *ఆహార గింజలలోనే* ఎక్కువగా ఉంది అనే నిజాన్ని తెలుసుకోండి. కూరగాయలనే (సాత్విక ఆహారాన్నే) ఎక్కువగా తీసుకోండి.
6. వీలైనంత వరకు *పండ్ల రసాలు, కూరగాయల రసాలను* ఇంట్లో తయారుచేసుకొని త్రాగండి.
7. *శారీరక వ్యాయామం* అని జిమ్ ల చుట్టూ తిరగకండి. వాకింగ్, జాగింగ్ సరిపోతుందిలే అనుకోకుండా, వెంటనే *యోగా* ను మొదలు పెట్టండి. కుదిరితే యోగ గురువును ఆశ్రయించండి. నాకు టైమ్ లేదు అనకుండా రోజూ కనీసం 20 నిమిషాలు అయినా *ఆసనాలు, ప్రాణాయామాలు, ధ్యానం* (మెడిటేషన్) క్రమం తప్పకుండా చేయండి.
8. *డబ్బు, అధికారం* మాత్రమే లోకం అనుకొని పరుగెత్తకుండా *ఆరోగ్యం*, మంచి జీవన విధానానికి ప్రాధాన్యతను ఇవ్వండి.
9. ఇల్లు కొనేటప్పుడు రాజీ పడము, వాహనం (టు వీలర్, ఫోర్ వీలర్) కొనేటప్పుడు రాజీ పడము, నగలు కొనేటప్పుడు రాజీ పడము, వేసుకునే బట్టలు కొనేటప్పుడు రాజీ పడము, చివరకు బయట విడిచే చెప్పులు, బూట్లు కొనేటప్పుడు కూడా రాజీ పడము. అలాంటిది *తినే ఆహారం* దగ్గర ఎందుకు రాజీ పడుతున్నాము. జంక్ ఫుడ్ అని తెలిసినా చాలా ఖరీదు పెట్టి మరీ కొని తింటాము. మంచి ఆహారం అనగానే ఇన్ని డబ్బులు పెట్టాలా, అది నిజంగా స్వచ్ఛమైన దేనా అని ఆలోచిస్తున్నాము. నీ పొట్టకు ఖర్చు పెట్టుకోవడానికే కక్కుర్తి పడుతున్నావు. ఇప్పటికైనా మారి *మంచి ఆహారానికి* మొదటి ప్రాధాన్యతను ఇవ్వు.
10. డబ్బు కన్నా *ఆరోగ్యం, ప్రశాంత మైన జీవనమే* ముఖ్యమని గుర్తెరుగు.
11. డబ్బు, ఆరోగ్య కార్డులు ఉన్నాయిగా అని, మంచి కార్పొరేట్ ట్రీట్మెంట్ ఇప్పించాలని చిన్న చిన్నదానికే *ఆస్పటల్* చుట్టూ తిరగకండి. సాధ్యమైనంత వరకు *ఇంటి వైద్యం* చేసుకోండి. అవసరం అయితేనే ఆస్పిటల్ కు వెళ్ళండి. జబ్బు వచ్చాకే మార్పు అనుకోకుండా, ముందు జాగ్రత్తగా ఉండండి. (*Prevention is better than cure.*)
12. వీలైనంత వరకూ *ప్రకృతి* కి దగ్గరగా ఉండేటట్టు చూసుకోండి.
13. రెస్టారెంట్లు, మాల్స్, పబ్ లు, తాగటానికి, ఆసుపత్రులకు, టైం పాస్ సీరియల్స్ కు టైం కేటాయించకుండా... పార్కులు, గుడులు గోపురాలు, ఫామిలీ గాధరింగ్స్, తీర్థ యాత్రలకు, విహార యాత్రలకు, నిజమైన స్నేహితులకు, మంచి పుస్తకానికి *మీ సమయాన్ని* కొంత కేటాయించండి.
14. *చెట్లను, మొక్కలను* పెంచుదాము, *ప్లాస్టిక్* వాడకాన్ని సాధ్యమైనంత వరకు నివారించుదాము.
15. ఇప్పటికైనా *భగవద్గీత* చదవడం మొదలు పెట్టండి. రామాయణం, భాగవతం, పురాణాలు, ఇతిహాసాలు, ఉపనిషత్తులు మొదలుగున్నవి చదవడం మొదలు పెట్టి మన *జీవన విధానం* గురించి తెలుసుకుందాం.
16. చెడు ఆలోచనలు రాకుండా, *మంచి జీవనం* కొరకు ఎప్పుడూ *భగవాన్ నామస్మరణ* చేస్తూ ఉండండి.

*ఆవు మాయమైపోతుంది. కుటుంబ వ్యవస్థ విచ్చిన్నమైపోయింది, ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై పోయాయి. బాంధవ్యాలు దూరమైపోతున్నాయి. ప్రకృతి వ్యవసాయం కనుమరుగైపోతుంది. గురువుకు గౌరవం లేకుండా పోతుంది. విద్య వైద్యం దారి తప్పినాయి. ఆహారం కలుషిత విషతుల్యమై పోయింది. బంధాల కన్నా, నైతిక విలువల కన్నా, ఆరోగ్యం కన్నా డబ్బే ప్రదానమై పోయింది. ఎక్కడ చూసినా మోసాలు, కుళ్లు, కుతంత్రాలు.*

*కుప్పలు తెప్పలుగా పెరిగిపోతున్న రెస్టారెంట్లు, హోటల్స్, హాస్పిటల్స్, రోగాలతో కిక్కిరిసిపోతున్న జనాలు. పుట్టగొడుగుల్లా పెరిగి పోతున్న వైన్ షాపులు, పిచ్చి కుక్కల్లా ఎగబడుతున్న జనాలు. రోజు రోజుకు పెరిగిపోతున్న విడాకుల పత్రాలు, వింత పోకడలు. నార్మల్ కాన్పు ఒక విడ్డురం. పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్న ఫెర్టిలిటీ సెంటర్లు, ఇప్పటి జనరేషన్ కి పిల్లలు కావడమే ఓ గగనం. చూడటానికి పుష్టిగా కనపడినా, ఒంట్లో సత్తువ లేదు. ఆడపిల్లల్లో అనూహ్య మార్పులు మూతిమీద మీసాలు, 14 సంవత్సరాల లోపే పుష్పవతి అవ్వడం, శరీర భాగాలు సరిగా పెరగక పోవడం, పెరుగుతే అతిగా పెరగడం. నెలసరి సరిగా రాకపోవడం... ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద పుస్తకమే రాయోచ్చేమో. టెక్నాలజీ పేరు చెప్పుకోవడమే కానీ కనీస వనరులని కాపాడుకోవడం తెలియదు. డబ్బు సంపాదించడం తెలుసు గానీ అనుభవించడం ఎలానో తెలియదు. రియల్ ఎస్టేట్ పెరిగిపోతోంది, వ్యవసాయ భూమి తరిగిపోతుంది.*

ఎటు పోతుంది **ఈ జీవితం*. వీటి మీద ఇప్పటికైనా *దృష్టి* పెడుదాము. మారుదాము. మన పూర్వీకులు చెప్పిన జీవన విధానం గురించి తెలుసుకొని ఆచరించుదాం. *మన ఆరోగ్యాన్ని, మన పరిసరాలను, ప్రకృతి ని కాపాడుకుందాము.*

జాగో భారత్... మీ గ్రూపులల్లో అందరికీ చేరేలా ఈ మెసేజ్ పంపండి.

*VNK*