హైదరాబాద్ లో వరద బీభత్సం:
ఓ వైపు కరోన చేసిన బీభత్సం, వెంటనే ఈ వరద బీభత్సం. కరోన వైరస్ నుంచి తెరుకుంటున్నం అనేలోపే ఈ అనుకోని వాన. అంతా అతలాకుతలం. ఉన్న కొన్ని చేరువులన్నీ నిండి పొంగి పొర్లడం, కొన్ని కట్టలు తెగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తడం. చాలా మంది వారి నివాసాలను కోల్పోవడం. ఈ కొద్ధి వర్షానికే ఏంటి ఈ పరిస్థితి. మరి ఈ తప్పెవరిది. ప్రకృతి వైపరిత్యమా లేక ఈ మాత్రం ఎదుర్కోలేని మన ప్రభుత్వాల లోపమా. ప్రభుత్వం అంటే పాలకులు మాత్రమేనా లేక ప్రజలు కూడానా.
ముమ్మాటికీ ఇది మన లోపమే. ఈ ప్రకృతి వైపరిత్యాలకు కారణాలు ఎవరు. అందులో మన పాత్ర ఎంత ఉంది, మన ప్రభుత్వాల బాధ్యత ఎంత ఉంది.
Techieride NGO team helping the people to take safe place |
ప్రభుత్వ లోపాలు:
ప్రతి సంవత్సరమూ వర్షాలు వస్తూనే ఉన్నాయి. కానీ అవి మాములు వర్షాలుగా రావటం లేదు. వస్తే వరదలు లేదంటే వర్షాలే లేకుండా పోవడం. చెప్పటానికి ఏదో ఒక వైపరిత్యం అని చెప్పుకుంటున్నాము. మరి దానికి మనం చేసే తప్పులు ఏమి లేవా. ఒక సంవత్సరము ముప్పు వచ్చిందంటే కొన్ని రోజులు చర్చలు, మీడియాలో కొన్ని రోజుల వరకు ప్రచారం, దానికి ప్రభుత్వం ఇచ్చే కొద్ది పాటి సహాయం. ఆ తర్వాత మళ్ళీ షరామాములే. మళ్ళీ వచ్చే సంవత్సరానికి చర్యలు తీసుకోవడం మాత్రము ఉండదు. మరి ఇది ప్రభుత్వ లోపం కాదా. ఇప్పుడు జరిగినది మళ్ళీ జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వానిది కాదా!
సిటీలో ఉన్న కుంటలు, చెరువులూ కబ్జా జరగకుండా చూసుకునే భాధ్యత ఎవరిది. అది ప్రభుత్వానిది కాదా. ప్రతి సంవత్సరము చెరువులు, కుంటలు పూడికలు తీసి ఉంచితే వరద నీటిని కాపాడు కోలేమా. కుంటలు, చెరువులు నిండితే అవి అలుగుపారి వేరే చోటికి పంపే ప్రక్రియ ఎందుకు ఉండటం లేదు. అసలు కుంటలు, చెరువుల చుట్టు ప్రక్కల ఇల్లు కట్టడాలకు ప్రభుత్వం ఎలా అంగీకరిస్తుంది.
ప్రభుత్వ పాలకులం అని చెప్పుకునే ఏ రాజకీయ నాయకుడు ఎందుకు బాధ్యత తీసుకోవడం లేదు. ఐదు సంవత్సరములు పాలన కాగానే అది మా బాధ్యత కాదు... ముందు ఉన్న ప్రభుత్వాలు ఏమి చేశాయి అని అనటం తప్ప, వచ్చిన ప్రభుత్వం ఎందుకు బాధ్యత తీసుకోవటం లేదు.
రహదారి వేసే కాంట్రాక్టు దారుడు రోడ్డు వేసేటప్పుడు రహదారికి ఇరువైపుల కనీసం ఫుట్పాత్ (నడిచివెళ్ళే) దారి కూడా వేయడం లేదు. మరి వర్షం వస్తే రహదారి (రోడ్డు) మీద పడ్డ వర్షం వెళ్ళటానికి రోడ్డుకు ఇరువైపుల ఇంకుడు గుంతల నిర్మాణం ఎందుకు జరగడం లేదు. రోడ్డుకు ఇరువైపుల ఇరవై అడుగుల దూరంకో ఒక ఇంకుడు గుంత ఉంటే రోడ్డు మీద నీరు ఎందుకు నిలుస్తుంది. రోడ్డు ఎందుకు కరాబు అవుతుంది. రహదారి మీద పడ్డ ప్రతీ వర్షపు చుక్కను కాపాడుకునే బాధ్యత ప్రభుత్వానిది కాదా. ఆ నీరు డ్రైనేజి లోకి ఎందుకు పోవాల్సి వస్తుంది. రోడ్డుకు ఇరువైపుల చెట్లు నాటకపోవడం కూడా దీనికి ఒక కారణమే. సిటీలో చాలా చోట్ల అసలు రోడ్డుకు ఇరువైపుల చెట్లే లేవు. అదే చెట్లు ఉంటే ఆ వాన నీటిని భూమిలోకి వెళ్ళటానికి సులువుగా ఉంటుంది. ఇది ప్రభుత్వ లోపం కాదా!
అప్పట్లో ఎప్పుడో వరదలు వస్తే నిజాం ప్రభుత్వం ఎక్కడో ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి మరీ మన డ్రైనేజీ సిస్టంను బాగుచేయించారని. ఇంకా మనం అప్పటి పద్దతినే వాడుతున్నాము. ఇంత జనాభా పెరిగినా ఇంకా పాత పద్దతినే పాటిస్తున్నాము. దానిని బాగుచేసుకోవాలని అని ఏ ఒక్కరు ఆలోచించటం లేదు. అప్పటి నుండి ఇప్పటివరకు అలాంటి సివిల్ ఇంజనీర్ లేనే లేడా. ఇంత టెక్నాలజీ పెరిగినా వాటిని ఉపయోగించుకోలేక పోతున్నామా. ఇది ప్రభుత్వ లోపం కాదా!
Techieride NGO distributing food items to the flood effected area Meerpet |
పాలిథిన్ వాడి బయట పడేయటం వల్ల అది భూమి పొరలలొనే ఉండిపోయి నీరు భూమిలోకి ఇంకకుండా అడ్డుపడుతూనే ఉన్నాయి. కాలువలు, చెరువులు, నదులు ఎక్కడచూసినా ప్లాస్టిక్ మయం. ప్రభుత్వం 50 మైక్రాన్స్ వరకు బంద్ చేసాము అని చెబుతుంది. కానీ అవి బయట విరివిగా దొరుకుతూనే ఉన్నాయి. మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవటంలేదు, ఏదో నామ మాత్రానికి మొదట్లో కొన్ని చర్యలు చేపట్టి ఏదో చేసేసాం అని చేతులు దులుపేసుకుంది. ప్రభుత్వం దీనిని ఎందుకు బందు చేయలేకపోతుంది. ఇది కూడా ప్రభుత్వ లోపం కాదా!
ప్రజల లోపాలు:
మనం మన భాద్యత ఎంత వరకు నిర్వర్తిస్తున్నాము. కుంటలు, చెరువుల ప్రక్కన మనం ఇల్లు కట్టుకుంటూ దోమలు వస్తున్నాయి, వాసన వస్తుంది అని మనమే ఆ కుంటలు, చెరువులు వద్దు అని వాటిని మూసేయాలి అని అంటున్నారు. ఇలా మూసేయాలి అనటం ఎంతవరకు కరెక్టు.
ప్రతీ ఒక్కరు ఏదో ఒక కారణంగా ఉన్న చెట్లను నరికి వేస్తున్నారు. ఒకరు చెట్లు ఉంటే మా ఇంటి గోడలు పగిలిపోతాయని, మా షాప్ లేదా ఇల్లు కనపడుట లేదు అని తీసేస్తున్నారు. కొందరైతే అసలు చెట్లను, కనీసం మొక్కలను కూడా పెంచటంలేదు. మరి రోడ్డు మీద పడే నీరు భూమిలోకి ఎలా ఇంకుతుంది. ఆ చెట్లే కదా నీటిని తీసుకొని భూమిలోకి పంపేది. ఇది ప్రజల బాధ్యత కాదా!
చాలామంది నీటుగా ఉండాలని వారి ఇంటిముందు మొత్తం ఫ్లోరింగ్ చేయిస్తున్నారు. మరి రోడ్డు మీద పారే నీరు భూమిలోకి ఎలా ఇంకుతుంది. ఆ నీరు డ్రైనేజీ లోకి వెళ్తే మొత్తం మట్టి, చెత్తతో నిండిపోతుంది. కొందరైతే చెత్తను కూడా డ్రైనేజీ లొనే వేస్తుంటారు, ఇంకొందరు ఇంట్లో ఉండే బాసాండ్ల చెత్తను, అంట్లను కూడా గచ్చులోనో నుండి డ్రైనేజీ లోకి పంపుతుంటారు. ఇది మనం చేసే తప్పులు కాదా!
Flood in Hyderabad in Oct, 2020 |
ప్రతీ ఒక్క ఇంటికి కనీసం ఒక్క ఇంకుడుగుంత అయినా ఉండాలి. అదే అపార్టుమెంటుకు ప్రదేశాన్ని బట్టి రెండు లేక మూడు ఇంకుడుగుంతలు ఉండాలి. మరి ఎంత మంది ఇళ్లలో ఇంకుడుగుంతలు ఉన్నాయి. వర్షము వచ్చినపుడు మిద్ద మీద పడ్డ నీరు ఇంకుడుగుంతల ద్వారా భూమిలోకి వెళ్ళాలి, కానీ అవి రోడ్డు మీద పారుతూ ఉంటాయి. ప్రతీ ఒక్కరు ఏదో ఒక సాకుతో ఇంకుడుగుంతలు కట్టించుకోరు. కానీ బోరు వేయించుకోవటానికి, పార్కింగుకు, డిజైన్ చేయించుకోవడానికి కేటాయిస్తారు కానీ ఇంకుడుగుంత మాత్రం ఉండదు. మరి ఇది ప్రజల తప్పులు కాదా!
ఇన్ని తప్పులు ప్రజలు, ప్రభుత్వ అధికారులు చేస్తూ అటు ప్రకృతిని దూషించటం ఎంతవరకు న్యాయం.
కొద్దిగా ఆలోచించండి. ఇప్పటికైనా మేల్కొండి.