వైరస్ లతో పోరాడటం ఎలా?
Image from india.com |
మనకు
ఎలాంటి వైరస్ సోకినా, జ్వరము, దగ్గు, జలుబు వచ్చినా, ఎలాంటి దెబ్బ తగిలినా
ముందుగా చేయవలసింది లంఖనం. ఎలాంటి ఘన పదార్ధాలు తీసుకోకుండా నీరు, పండ్ల
రసాల ఉపవాసం చేసి మన రక్షణ వ్యవస్థను మెరుగు పరుచుకోవాలి. ఇలా 4 లేదా 5
రోజులు చేస్తే మన రోగ నిరోధక శక్తి త్వరగా పెరిగి వైరస్ లతో పోరాడటానికి
శక్తిని ఇస్తుంది.
1 వ రోజు: తేనె నిమ్మరసం, గోరువెచ్చని నీరు మరియు తేనె, కొబ్బరి నీళ్ల తో ఉపవాసం.
ఈ
మూడింటిని గంట గంటకి ఒకటి చొప్పున తీసుకుంటూ రాత్రి పడుకునే వరకు మార్చి
మార్చి తీసుకోవాలి. మధ్య మధ్యలో 1 లేదా 2 గ్లాసుల నీళ్లు మంచి నీళ్ళు
త్రాగుతూ ఉండాలి.
ex. 8 am - తేనె నిమ్మరసం
8.30 am - 1 గ్లాస్ మంచి నీరు
9 am - గోరువెచ్చని నీరు మరియు తేనె
9.30 am - 1 గ్లాస్ మంచి నీరు
10 am - కొబ్బరి నీళ్లు
అలా రాత్రి పడుకునేవరకు ఇస్తూ ఉండాలి.
2 వ రోజు: పండ్ల రసాలతో ఉపవాసం
గంట
గంటకు ఒక పండ్ల రసం (జామ, బొప్పాయి, బత్తాయి, నారింజ, పుచ్చకాయ..
మొదలుగున్నవి) చొప్పున రాత్రి పడుకునేవరకు మార్చి మార్చి తీసుకోవాలి. మధ్య
మధ్యలో 1 లేదా 2 గ్లాసుల నీళ్లు మంచి నీళ్ళు త్రాగుతూ ఉండాలి.
3 వ రోజు: కూరగాయల రసాల ఉపవాసం
1. క్యారెట్, బీట్రూట్, కీరా జ్యూస్
2. పుదీనా, కొత్తిమీర, తులసి ఆకు జ్యూస్,
3. బీర, సోర, పోట్ల, బూడిద గుమ్మడి, తమాట జ్యూస్
4. మునగ ఆకు, కరివేపాకు జ్యూస్
5. పాలకూర, కరివేపాకు జ్యూస్
6. గోధుమ గడ్డి జ్యూస్
7. తమాట, కీరా జ్యూస్
4 వ రోజు:
1. మజ్జిగ, నిమ్మరసం, తేనె
2. రాగి అంబలి
3. కొబ్బరి నీళ్లు
4. బాదం, కాజు, కొబ్బరి మిల్క్ షైక్ (బాదం, కాజు రాత్రి నానబెట్టండి, వాటిని ప్రొద్దునే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి, పిప్పిని తీసి పాలు తీయండి. బాదం, కాజు పాలు మరియు కొబ్బరి పాలు కలిపి తేనె తో కలిపి త్రాగండి. మంచి పోషక విలువలు లభిస్తాయి.)
గంట గంటకు నీళ్లు త్రాగుతూ వీటిని రోజు మొత్తం తీసుకుంటూ ఉండాలి.
5 వ రోజు: పండ్ల తో ఉపవాసం
మూడు పూటలా కావలసినన్ని పండ్లు (మూడు నాలుగు రకాలు), డ్రై ఫ్రూయిట్స్ తినాలి.
వీటితో పాటు ప్రతీ రోజు ఈ క్రింది నియమాలు పాటించాలి:
1. రోజుకు 4-5.5 లీటర్ల నీరు త్రాగాలి
2. రోజుకు రెండు సార్లు (ఉదయం, సాయంత్రం) అయినా మలవిసర్జన చేయాలి.
3. పడిశం (Cold) బాగా ఉన్నచో రెండు మూడు సార్లు వేడి నీళ్లు పసుపుతో ఆవిరి పట్టుకోవాలి.
4. ఉదయం, సాయంత్రం కాలి కడుపున ప్రాణాయామాలు చేయాలి.
5. డి విటమిన్ కొరకు కొంతసేపు ఎండ వేడిమికి ఉండాలి.
6. దగ్గు బాగా ఉన్నచో గోరువెచ్చని నీరు కొద్ధి కొద్దిగా త్రాగుతూ ఉండాలి.
7. మన శరీరానికి తగిన విశ్రాంతిని ఇవ్వాలి.