Thursday, July 9, 2020

కరోన మహమ్మారి.... రోగనిరోధక శక్తి ఒక్కటే దీనికి పరిష్కారం

కరోన మహమ్మారి.... 

ఏంటి జీవితం. ఏనాడైనా అనుకున్నామ ఇలాంటి జీవితం గడుపుతామని. మూతికి గుడ్డ కట్టుకొని, దెగ్గరి వాళ్ళను కూడా ముట్టుకోలేక అంటరానివాళ్ళలాగా... కడుక్కున్న చేతులని మళ్ళీ మళ్ళీ కడుక్కుంటు... ఏమవుతుందో అనుకుంటూ బిక్కు బిక్కు మంటూ జీవనం గడపడం.

బయట బోలెడు పనులున్న.. బయటకు పోతే కరోన మహమ్మారి తగులుకుంటుందోనని... ఉన్నవాడు తనకున్నదానితో సర్దుకుంటుంటే... లేనివాడు ఆకలికేకలతో అలమటిస్తున్నాడు.

ప్రభుత్వము ఏమి చేయాలో తోచక దిక్కు తోచని స్థితిలో ఉక్కిరిబిక్కిరి అవుతూఉంది. ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక... ఎలా దాన్ని కంట్రోల్ చేయాలో అర్థం కాక, ఏమందు వాడాలో తికమకతో తల బద్దలు కొట్టుకుంటుంది.

Image from forbes.com

మాస్కులు, సానిటైజర్, మరియు సహజ దూరం పాటిస్తూ ఇలా ఎన్నాళ్ళు బ్రతకాలి. అన్ని పనులు వదులుకొని ఎన్నాళ్ళు ఇంట్లో కూర్చోవాలి. దీనికి వాక్సిన్ కనిపెడుతేనే పరిష్కారమ... మరి మళ్ళీ వేరే వైరస్ వస్తే మళ్ళీ వాక్సిన్ కనిపెట్టడమే దీనికి శాశ్వత పరిష్కారమ.

ఇలా ప్రతీసారి ఏదోఒక జబ్బుకొరకు వాక్సిన్ కనిపెడుతూనే ఉండాలా... వాటికొరకు కోట్లు కోట్లు ఖర్చుపెడుతూనే ఉండాలా... ఇంకా ఎన్నాళ్ళు తాత్కాలిక పరిష్కారాలు. మరి జంతువులకు ఎందుకు రావడం లేదు జబ్బులు. మనుష్యులకే ఎందుకు... రోగనిరోధక శక్తి ఉంటే ఎలాంటి జబ్బులు రావు, రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలి అని చెప్తున్నారు... మరి దీనికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఎవరు చెప్పలేకపోయారు ఎందుకు. ఒక్క డాక్టర్ కూడా వీటి గురించి సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఎవరో కొందరు చెప్తున్న వాటి మీద ప్రభుత్వము దృష్టి పెట్టలేకపోతున్నది.

 

మరి దీనికి పరిష్కారం ఎలా...

 

ఇమ్మ్యూనిటి పవర్ (రోగనిరోధక శక్తి) ఒక్కటే దీనికి పరిష్కారం. చాలా మంది రోగనిరోధక శక్తి పెరగాలి అనగానే వెంటనే అల్లం, పసుపు, శొంఠి ఇలా కషాయాలు తీసుకుంటున్నారు. ఇవి మంచివే కానీ ఏదైనా ప్రాబ్లెమ్ ఉన్నపుడే వీటిని ఎక్కువగా తీసుకోవాలి జబ్బు తగ్గేవరకు. మాములుగా ఉన్నపుడు తీసుకోవలసిన అవసరం అంతగా లేదు. ఎప్పుడో ఒకసారి తీసుకోవడంలో తప్పులేదు. కానీ రోజు తీసుకోవలసిన అవసరం లేదు. రోజు తీసుకుంటే రోగనిరోధక శక్తి తగ్గిపోయే ప్రమాదం కూడా ఉంది.

 వీటికన్నా మనం రోజు తీసుకోవలసిన వాటిల్లో సి విటమిన్ ఉండే పదార్దాలు ఉండాలి. నిమ్మ, ఉసిరి, జామకాయ.. మొదలుగున్నవి ఎక్కువగా తీసుకోవాలి. డైలీ మొలకెత్తిన విత్తనాలు, పండ్లు, కూరగాయల జ్యూస్ లు, పండ్ల రసాలు, కొబ్బరి బొండాలు, మజ్జిగ, రాగి అంబలి, సిరి ధాన్యాల జావా, క్యారెట్, బీట్రూట్ జ్యూస్ లు.. ఇలా ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార పదార్దాలు తీసుకోవాలి. భోజనంలో కూరగాయలు చాలా మొత్తంలో తీసుకోవాలి. ఇంకా చాలా మందిలో డి విటమిన్ లోపం వల్ల కరోన లేక వేరే ఇతర జబ్బలు బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రొద్దుటే వచ్చే ఎండలో కొద్దిసేపు రోజు అందరూ ఉండాలి, దాని వల్ల వచ్చే సూర్యరశ్మి కి చక్కటి డి విటమిన్ లభిస్తుంది.

photo from heart.org

 మన జీవన శైలి కూడా మారాలి. మనం తినే తిండి మారాలి. శారీరక శ్రమ రోజు ఉండాలి. రైతులు, పారిశ్రామక సంస్థలు కెమికల్ ఫ్రీ మరియు సేంద్రీయ ఎరువులతో పంటలు పండిచాలి. అప్పుడే మనకు రోగాలు రాకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరు చెట్లను పెంచాలి. తినే ప్రతి పదార్ధం ప్లాస్టిక్ లో లేకుండా చూసుకోవాలి. నాచురల్ మరియు ఆర్గానిక్ ఫార్మింగ్ పెరగాలి. చిన్న చిన్న మార్పులతోనే ఎంతో లాభం ఉంది. ఇవి పట్టించుకోకుండా ఎన్నో వందలు, వేలు మందులకు, వేరే వాటికి ఖర్చుపెడుతున్నారు. వీటికి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి.

 

ప్రభుత్వం బాధ్యత...

 

పండే పంటలు, తినే తిండి, త్రాగే నీరు, ఆహార పదార్దాలు అన్ని కలుషితం కాకుండా చూసుకోవాలి. కెమికల్స్, ఎరువులు, ప్లాస్టిక్ వాడకం, స్టెరాయిడ్స్ వాడకాన్ని బ్యాండ్ చేయాలి. ఆర్గానిక్ ఫార్మింగ్, కెమికల్ ఫ్రీ, సేంద్రియ ఎరువులను ప్రోత్సహించాలి. ప్రభుత్వము పారిశ్రామక వ్యవస్థల గుప్పిట్లో ఉండకుండా రైతులను ప్రోత్సహిస్తే మంచి ఫలితాలు కూడా వస్తాయి. అలా చేస్తే రైతులు ఆత్మహత్యలు చేసుకోవలసిన అవసరం ఉండదు. అందరికి ఆహార నియమాల అవగాహన పెంపొందించాలి.

 Few Naturopathy doctors suggestions in their words...

కరోNA వైరస్ ను తట్టుకునే శక్తి కావాలంటే | Immunity I Manthena Satyanarayana raju | Health Mantra |

కరోనా వైరస్|CORONA VIRUS|dr ramachandra| prakruthi tv| health tips| immunity|breaking news|


కరోనాకి మందు ఈ కాషాయమే..| Coronavirus Cure Revealed | Coronavirus Treatment | Dr Sarala Khader

Prakruthivanam Prasad Precautions and Awareness on Present Situation | SumanTV Organic Foods

Precautionary Measures Of coronavirus through Natural Ways In Telugu | Ravi Verma | PMC

Written by...

Naveen Kumar Valloju

TechnoSpoorthi

http://visitbeautiindia.blogspot.com/